Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు అందరూ కుంకుడుకాయల రసంతోనే తలస్నానం చేసే వారు. కానీ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కుంకుడుకాయలకి స్థానం లేదు. అయితే షాంపూలు పడని వాళ్ళో, మళ్ళీ మన పాత పద్ధతుల వైపు వెళ్దాం అని ఉత్సాహం ఉన్న వాళ్ళో కుంకుడుకాయల గురించి ఆలోచిస్తు న్నారు. షాంపూల కంటే కుంకుడు కాయల వల్ల జుట్టుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే...
- కుంకుడు కాయల రసం నాచురల్ షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి పోషణనిస్తుంది. దాంతో జుట్టు మెరుస్తూ ఉంటుంది. జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది.
- తలలో ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. కుంకుడు కాయలు తలను పూర్తిగా శుభ్రపరుస్తాయి. దాంతో ఫంగస్ సమస్యే ఉండదు. తరచుగా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది.
- కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ ఏ, డీ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. అందులో ఉన్న విటమిన్స్ జుట్టు కుదుళ్ళకి బలాన్నిచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ విటమిన్స్ కొత్త ఫాలికిల్స్ ఏర్పడడానికి సహాయం చేస్తాయి.
- కుంకుడు కాయలు, హెన్నా కాంబినేషన్ మంచి కండిషనర్‌లా పని చేస్తుంది. దాని వల్ల జుట్టు డ్రై గా అవ్వకుండా ఉంటుంది.
- వీటిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వలన జుట్టు రాలడం తగ్గిపోతుంది. జుట్టు చిక్కులు లేకుండా స్మూత్‌గా ఉంటుంది.