Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పైల్స్... ఈ సమస్య ఉందని పైకి చెప్పుకోడానికే మొహమాటం చాలామందికి. ముఖ్యంగా మహి ళలు అయి మరీ ఇబ్బంది పడతారు. దురద, నొప్పి, మంట వేధిస్తున్నా చూపించుకోడానికి సిగ్గేసి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లరు. అలా అని నిర్లక్ష్యం చేస్తే ఇది సర్జరీ వరకూ తీసుకెళ్తుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటించండి.
- ముందు ఆహారంలో ఉప్పు, పులుపు, కారం తగ్గించేయండి. పీచు పదార్థాలను పెంచండి. రోజుకు నాలుగైదు లీటర్ల నీటిని తాగండి. ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోండి.
- తగినంత నిద్రపోండి. మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా పైల్స్ ఇబ్బంది పెడతాయి.
- కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ కూడా తగ్గించండి.
- అంజూరపు పండ్లను రాత్రంతా నీటిలో నాబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీళ్లు తాగితే సుఖ విరేచనం అవుతుంది. రోజూ అలా చేయడం వల్ల మెల్లగా పైల్స్ తగ్గిపోతాయి.
- నీటిలో నాలుగు బిర్యానీ ఆకులు, మూడు వెల్లుల్లి రేకులు వేసి మరిగించాలి. ఈ నీటిని రోజుకు మూడుసార్లు పైల్స్ ఉన్న చోట రాస్తే మెల్లగా వాపు, నొప్పి తగ్గిపోతాయి.
- టీ ట్రీ ఆయిల్లో ఆముదం కానీ బాదం నూనె కానీ కలిపి రాసినా ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జు రాసినా మంచిదే.
- పైల్స్ నొప్పి భరించలేనిదిగా ఉంటే... వేడిపాలలో నిమ్మరసం కలుపుకుని మూడు గంటలకోసారి చొప్పున రోజంతా తాగండి. బాధ తగ్గుముఖం పడుతుంది.
- రోజూ పడుకునే ముందు నిమ్మరసంలో దూది ముంచి పైల్స్ మీద పెట్టుకోండి. దీనివల్ల కొద్ది కాలానికి సమస్య తీరిపోతుంది.
ఇన్ని చేసినా తగ్డకపోతే సమస్య ముదిరినట్టు లెక్క. అప్పుడు మాత్రం మొహమాట పడకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లండి. లేదంటే మరీ ముదిరిపోయి పరిస్థితి చేయి దాటవచ్చు!