Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి మార్కెట్లో దొరికే ఏం క్రీం పడితే ఆ క్రీం రాయటం మంచిది కాదు. ఇలా చేస్తే మీ కళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. అదీకాక మన కళ్ళకు పడే క్రీములు కాకపోతే కళ్ళు పోయే ప్రమాదమూ ఉంది. అందుకే వైద్యుని సలహాతో వాడాలి.
- అర టీస్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ళకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి.
- కళ్ళకు విశ్రాంతి ఎంతైనా అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్ళకు రోస్ట్ దొరికి తాజాగా కనపడతాయి.
- గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో ఉదయాన్నే కళ్ళను కడుక్కుంటే కళ్ళు తాజాగా మెరుస్తాయి. ఉసిరి అన్ని విధాలా ప్రయోజనకారే.
- కళ్ళ చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే ముడతల నుండి విముక్తి పొందవచ్చు.
- నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి కొందరికి. ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కళ్ల అడుగున రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వస్తుంది.