Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. అయితే దానికోసం బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంట్లోని కొన్ని వస్తువులను కూడా ఉపయోగించి అందంగా తయారవ్వొచ్చు. అందుకోసమే ఈ చిట్కాలు.
న ముందుగా ఏదైనా ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తటి టవల్‌తో తుడుచుకోవాలి.
- ఇప్పుడు స్క్రబ్ చేయాలి. అంటే ఓ స్పూన్ తేనెలో అంతే చక్కెర కలిపి బాగా రాయాలి.. కావాలంటే నిమ్మరసం రెండు చుక్కలు కలుపుకోవచ్చు.
ఫేస్ ప్యాక్ తయారీ...
- శెనగపిండి - ఓ టీస్పూన్, పాలపొడి -టీస్పూన్, పాలు(లేదా) రోజ్ వాటర్- 2 టీస్పూన్లు తీసుకోవాలి.
- ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పాలపొడి కలపాలి.
- ఆ మిశ్రమంలో రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
- ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.
- 15 నిమిషాలు అయ్యాక కొన్ని నీళ్ళు చల్లి నెమ్మదిగా రుద్దుతూ చల్లని నీటితో కడిగేయాలి.
- ఇప్పుడు అలోవేరా జెల్‌ని కాస్తా చేతిలోకి తీసుకుని రెండు నిమిషాల్ మసాజ్ చేస్తే సరి..
ఇప్పుడు మీ ముఖంలో వచ్చిన తేడాను మీరే గమనించొచ్చు. కేవలం శనగపిండే కాదు.. ముల్తానీ, బియ్యంపిండి ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పాలకి బదులు నచ్చిన పండు రసాన్ని కలిపితే అదనపు అందం మీ సొంతం.