Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బరువు తగ్గడం పెరిగినంత తేలిక కాదు. నోరు కట్టేసుకుని, కడుపు కాల్చుకుని ఎంత కష్టపడినా తగ్గని బరువును చూసి తెగ బాధపడిపోతుంటారు చాలామంది. అలాంటివారికి డాక్టర్లు ఓ సలహా చెబుతున్నారు. నోటికి రుచిగా కొన్ని జ్యూసులు తాగుతూ కూడా బరువు తగ్గొచ్చంటున్నారు. ఇదిగో... ఇవే ఆ జ్యూసులు.
- గోరువెచ్చని నీళ్లలో ఆరెంజ్ జ్యూస్ కలుపుకుని, కొద్దిగా తేనె చేర్చి తాగుతూ ఉంటే క్రమక్రమంగా బరువు తగ్గుతారట.
- పైనాపిల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుందట. కాబట్టి రోజుకోసారి పైనాపిల్ జ్యూస్ తాగితే ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకోకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు.
- ద్రాక్షపండ్ల రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
- నిమ్మరసంలో ఉప్పు, తేనె చేర్చి పరగడుపున తాగినా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
- జామకాయలో ఉండే విటమిన్ సి బరువును తగ్గించడంలో ఎక్స్ పర్ట్.
- అవకాడో జ్యూస్ క్యాలరీలను కరిగిస్తుంది.
- టమాటాలను ఉడికించి, గ్రౌండ్ చేసి, కొద్దిగా బెల్లం కలుపుకుని మూడు పూటలా తాగినా మంచి ఫలితముంటుంది.
చూశారు కదా? రుచికి రుచి... మంచికి మంచి. కాబట్టి తరచూ ఈ ఫ్రూట్ జ్యూసులు తాగండి. అయితే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎప్పుడూ ఎందులోనూ పంచదార మాత్రం కలపవద్దు. కలిపారో... జ్యూస్ తాగడం వల్ల ఏ ఉపయోగం ఉండదు.