Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బఠాణీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని అప్పుడప్పుడు మనం తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాం.
- బఠాణీలు... నోటికి రుచినివ్వడమే కాదు వీటిని తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
- ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠాణీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
- అల్జీమర్స్, ఆర్థరైటీస్ వంటి జబ్బులు రాకుండా బఠాణీల్లోని పోషకాలు అడ్డుకుంటాయి. ఎముకల్ని కాపాడతాయి.
- కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని అధికంగా తీసుకోవాలి.
- బఠాణీల్లోని అధికమొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్ పొట్ట క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
- ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్స్ కలిగిన బఠాణీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది.
- ఫైబర్ అధికంగా ఉన్న బఠాణీలు తీసుకోవడం వల్ల రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది.
- బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్ కలిగిన బఠాణీలు తీసుకోవడం వల్ల గుండెసమస్యల ముప్పు నుంచు తప్పించుకోవచ్చు.
- ఒక కప్పు బఠాణీలు 44శాతం విటమిన్ కె ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.