Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాకింగ్ చెయ్యడం తేలికే... జాగింగ్ అనేది పెద్దవాళ్లకు, అధిక బరువు ఉన్నవాళ్లకు చాలా కష్టం. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే తప్ప చెయ్యలేరు. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే... కచ్చితంగా జాగింగ్ చేస్తారు.
ఎ రన్నింగ్ వల్ల బాడీ మొత్తం షేక్ అవుతుంది. కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. నిజంగా బరువు తగ్గాలంటే ఐదు నిమిషాల జాగింగ్ సరిపోదు. కానీ అసలు ఎక్సర్సైజే చెయ్యడానికి టైమ్ లేకపోతే, ఐదు నిమిషాల రన్నింగ్ తోనైనా క్యాలరీలు, కొవ్వు కరిగించుకోవచ్చు. మనకు డైలీ ఎన్ని కేలరీల శక్తి వస్తోందో అంత కంటే ఎక్కువ కేలరీల శక్తి ఖర్చు అయితేనే బరువు తగ్గుతాం. కాబట్టి దాన్ని దష్టిలో పెట్టుకొని సరిపడా వాకింగ్, జాగింగ్, వర్కవుట్స్ చేస్తే మంచిదే.
ఎ ఉదయాన్నే నిద్ర మత్తు ఉంటుంది. అలాంటి సమయంలో జాగింగ్‌కి వెళ్తే ఆ పచ్చటి ప్రకతి, సూర్య కిరణాలు, పక్షుల అరుపులు, చక్కటి వాతావరణం... అన్నీ కలగలిసి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అది తలనొప్పిని తగ్గిస్తుంది. బాడీకి, బ్రెయిన్‌కీ ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. రోజూ జాగింగ్ చేస్తూ ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్‌గా చక్కగా తయారవుతుందని ఎన్నో పరిశోధనల్లో తేలింది.
- ఈ రోజుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. డయాబెటిక్ పేషెంట్లు ఐదు నిమిషాలు కేటాయించి వీలైనంతగా పరుగులు పెడితే బ్లడ్‌లో షుగర్ (గ్లూకోజ్) లెవెల్స్ పెరిగిపోకుండా, తగ్గిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండేందుకు వీలవుతుంది. ఐదు నిమిషాల జాగింగ్‌తో షుగర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చని పరిశోధనలు రుజువుచేశాయి.
ఎ కొంతమందికి సరిగా నిద్ర పట్టక రాత్రిళ్లు మొబైల్లో మెసేజ్‌లు, చాటింగ్ చేస్తూ గడిపే స్తారు. నిద్రపోకపోవడం ఓ సమస్య అయితే, మొబైల్ వాడటం మరో తీవ్రమైన సమస్య. ఈ రెండింటికీ చెక్ పెట్టాలంటే వాకింగ్, జాగింగ్ వంటివి చెయ్యాలి. ఇలా చేస్తే బాడీలో కొవ్వు కరిగి శరీరంలో అన్ని అవయవాలూ చక్కగా పని చేస్తాయి. బ్రెయిన్ కూడా చురుకుగా మారి నిద్ర పోవాల్సిన టైముకి మిగతా పార్టుల్ని పడుకో బెట్టేస్తుంది. బాడీలో బయోక్లాక్ బాగా పనిచేస్తూ ఆరోగ్యం మెరుగవుతుంది.
- షుగర్ లాగే హైబీపీ సమస్య కూడా చాలా మందికి ఉంటోంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే మిగతా శరీర అవయవాలకు ప్రమాదం. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చక్కగా ఐదు నిమిషాలు పరిగెడితే గుండె హాయిగా ఉంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తే ధమనుల్లో పేరుకున్న కొవ్వు నిల్వలు కరిగిపోయి రక్త సరఫరా సరిగ్గా ఉంటుంది.