Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే అంజీరా పండ్లు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తున్నాయి. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
- బరువు తగ్గాలనుకునేవారు అంజీర తింటే... చక్కగా తగ్గుతారు. అలాగని మరీ ఎక్కువ అంజీరలు తింటే బరువు పెరుగుతారు. అందువల్ల రోజుకు నాలుగైదుకి మించకుండా తింటే మంచిదే.
- శరీరంలో పొటాషియం తక్కువగా, సోడియం ఎక్కువగా ఉంటే, బీపీ పెరుగుతుంది. అంజీర్లలో పొటాషియం ఎక్కువ, సోడియం తక్కువ. అందువల్ల వీటిని తింటే బీపీ తగ్గుతుంది.
- షుగర్ వ్యాధిని కంట్రోల్ చెయ్యడానికి అంజీరలు పనికొస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువ కాబట్టి. అంజీరలోని పొటాషియం మన శరీరంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.
- పైల్స్ సమస్య వేధిస్తుంటే... రాత్రంతా నీటిలో నానబెట్టిన డ్రై అంజీరలను వాటర్‌తో సహా తింటే సరి. పైల్స్ సమస్య పరిష్కారమవుతుంది.
- లైంగిక సమస్యలు, సంతానలేమితో బాధపడేవారికి అంజీరలు అద్భుతంగా పనిచేస్తాయి. స్పెర్మ్ కౌంట్ పెంచేందుకు ఇది దోహదపడతాయి.
- మన శరీరంలోకి విషవ్యర్థాలు, సూక్ష్మ క్రిములు, బ్యాక్టీరియా లాంటివి రాకుండా చేసే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్ వంటివి అంజీరలో చాలా ఉంటాయి. కాబట్టి వాటిని తినాలి.