Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వయసు పెరిగే కొద్ది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ ఆహార పదార్థాలను మీ ప్రణాళికలో కలుపుకొంటే రంగు వేసుకోవలసిన అవసరమే ఉండదు. ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా జుట్టు తెల్లబడటాన్ని నివారించవచ్చు.
పచ్చని ఆకుకూరలు : పచ్చని ఆకుకూరలు తలపై చర్మం పునరుద్దపరిచే విటమిన్ 'బి' లను కలిగి ఉంటాయి. సాధారణంగా ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, వెంట్రుక అన్ని భాగాలకు రక్తం పంపిణి చేయటానికి తలపై చర్మానికి విటమిన్ 'బి-6', విటమిన్ 'బి-12' లు అవసరం. మన జుట్టు నల్లగా ఉండటానికి లేదా సహజ రంగులో ఉండటానికి విటమిన్ 'బి-2' పై ఆధారపడి ఉంటుంది.
సాల్మన్ చేప : దీనిని జుట్టు తెల్లబడకుండా ఆపే ఆహార పదార్థాలలో ఇది ఒకటి. వెంట్రుకల ఆరోగ్యానికి కావలసిన హార్మోన్లను స్రవించుటకు సాల్మన్ చేపలో ఉండే సెలీనియం ఎంతో ఉపయోగపడుతుంది. వారంలో రెండు లేదా మూడు సార్లు సాల్మన్ చేపను తింటే మంచి ఫలితం ఉంటుంది.
గుడ్లు : జుట్టు తెల్లబడకుండా ఉండటానికి విటమిన్ 'బి-12' సహకరిస్తుంది. ఇది గుడ్డులో లభిస్తుంది. నిజానికి ఫ్రీరాడికల్లు మన వెంట్రుకలను తెల్ల రంగులోకి మార్చుతాయి. కావున రోజు తినే ఆహార పదార్థాలలో ఒక గుడ్డును తినటం వలన జుట్టు తెల్లబడటాన్ని కొంత వరకు నివారించవచ్చు.