Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెగ్యులర్ వర్కవుట్లతోపాటూ... ఫేస్కోసం ప్రత్యేక వర్కవుట్లు చెయ్యాలి. సాధారణంగా ఎవరైనా బరువు పెరిగితే ఆటోమేటిక్‌గా ఫేస్ కూడా లావు అవుతుంది. అదే బరువు తగ్గితే ఫేస్ కూడా సన్నబడుతుంది. అయితే.... చూడచక్కటి ఫేస్ కోసం చిన్నపాటి ఎక్సర్సైజ్లు అవసరం. ముఖ్యంగా గడ్డం కింద... క్యారీబ్యాగ్‌లా పెరిగే కొవ్వుకు చెక్ పెట్టాల్సిందే. ముఖంలో కొవ్వు ఉందంటే బాడీ మొత్తం కొవ్వు ఉందనే అర్థం. ముఖంలో కొవ్వును పోగొట్టడం కోసం ఈ ఎక్సర్సైజ్ చెయ్యండి.
- మీ ముఖాన్ని వెనక్కి వంచండి, మీ గడ్డాన్ని ముందుకు పైకి తేవాలి.
మీ రెండు బుగ్గల్నీ నోటి లోపలికి లాక్కోండి. వీలైనంతగా ఇలా చెయ్యండి.
5 సెకండ్లపాటూ బుగ్గల్ని అలాగే లోపలికి ఉంచండి.
ఇలా రోజూ 10 నుంచి 15 సార్లు చెయ్యండి.
- ఇలా చేస్తే... వెంటనే కొవ్వు మొత్తం కరిగిపోదు. మెల్లగమెల్లగా మార్పు వస్తుంది. కొన్ని రోజులకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇలా చేస్తూనే ఆయిల్ ఫుడ్ తగ్గించాలి. ఆకు కూరలు, కూరగాయల్ని ఎక్కువగా తినాలి. నీరు బాగా తాగాలి. హెల్తీ లైఫ్‌స్టైల్ లేనప్పుడు ముఖంలో కొవ్వు వున్నా, లేకపోయినా ప్రయోజనం ఉండదు. అందువల్ల ఈ జాగ్రత్తలు పాటిస్తూ... ఆరోగ్యాన్ని పెంచుకోండి.