Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చికెన్, మటన్, గుడ్లు వీటిలో ప్రోటీన్స్ ఫుల్లుగా ఉంటాయి. అయితే... వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ప్రోటీన్స్ ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవసరం. ఎందుకంటే మనలో రోగనిరోధక శక్తి పెరగా లన్నా, ఎనర్జీ ఉండాలన్నా, పనులు చేసుకోవా లన్నా, కండరాలు బలంగా ఉండాలన్నా... శరీరంలో ప్రోటీన్స్ లేకపోతే కష్టం. అమ్మాయిలకు రోజుకు 46 గ్రాములు కావాలి. సాధారణంగా చికెన్, మటన్ వంటివి తినే వారికి ప్రోటీన్స్ లోపం ఉండదు. కనీసం గుడ్లైనా తింటే ఈ లోపాన్ని కవర్ చేసుకోవచ్చు. ఇవేవీ తినడం ఇష్టం లేని వారు ప్రత్యేక ఆహారం తీసుకోవడం తప్పనిసరి. మనం బలంగా, ఎనర్జీతో ఉన్నప్పుడు ఏ అనారోగ్య సమస్యలూ రావు కాబట్టి... ప్రోటీన్స్ కోసం ఎలాంటి శాఖాహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
పల్లీలు : వీటిలో ప్రోటీన్స్ బోలెడు ఉంటాయి. దాదాపు చికెన్‌తో సమానం. 10 గ్రాముల చికెన్‌లో 27 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అదే 100 గ్రాముల పల్లీల్లో 26 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
బాదం : బాదం పప్పుల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ బాగా ఉంటాయి. 100 గ్రాముల్లో 21.15 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అదే 100 గ్రాముల గుడ్లలో 11 గ్రాముల ప్రోటీన్సే ఉంటాయి. అయితే... బాదంపప్పులు మరీ ఎక్కువ కాకుండా రోజుకు నాలుగు వరకు తినొచ్చు.
నానబెట్టిన నల్ల శనగలు : వీటిని రాత్రంతా నానబెట్టి తెల్లారి తినేస్తే ఫుల్ ఎనర్జీ. 100 గ్రాముల శనగల్లో 17
గ్రాముల ప్రోటీన్స్ దక్కుతాయి.
ఓట్స్ : ఈమధ్య ప్రజలు ఓట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎందుకంటే వాటితో ఉన్న ప్రయోజనాలు అలాంటివి మరి. వీటిలో ఫైబర్, మెగ్నీషియం, మాంగనీస్, థయామిన్, విటమిన్ బి1 ఉంటాయి. 100 గ్రాముల ఓట్స్‌లో 16.9 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
పన్నీర్ : పన్నీరులో ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ బి12, సెలెనియం, రైబోఫ్లావిన్ ఇతర పోషకాలుంటాయి. 100 గ్రాముల పన్నీరులో 14 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
రాజ్మా : వీటినే కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. వీటిలో పొటాషియం, కాల్షియం, ప్రోటీన్స్ బాగా ఉంటాయి. రాజ్మా సూప్ లేదా కర్రీ తింటే చాలు చాలా ఎనర్జీ వస్తుంది. 100 గ్రాముల రాజ్మాలో 9 గ్రాముల ప్రోటీన్స్ లభిస్తాయి.