Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి భయపడే జనం ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? అయితే కొంచెం ఆలోచించండి...
- ఆన్ లైన్ షాపింగ్ వల్ల పర్యావరణ పరిరక్షణానికి ప్రయోజనం కలుగుతుందని మీరు భావిస్తే.. మీరు పొరపాటు పడినట్టే.
- ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అమెరికన్ కెమికల్ సొసైటీ ప్రచురించిన నివేదిక ప్రకారం నేరుగా షాప్‌కి వెళ్లి కొనుగోలు చేసే కంటే ఆన్ లైన్ షాపింగ్ వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని చెప్పారు.
- నేరుగా షాపుకి వెళ్లి కొనడం వల్ల అన్ని వస్తువులు ఒకేసారి తీసుకోవడానికే చూస్తారు. అదే ఆన్ లైన్ షాపింగ్ అయితే రెండు మూడు వస్తువులు ఒకసారి.. ఆ తర్వాత మరికొన్ని వస్తువులు.. ఇలా విడతల వారీగా కొంటారు.
- ఇలా ఒకే ఆర్డర్లో తీసుకునే వస్తువులు ఎక్కువ ఆర్డర్లు చెయ్యడం వల్ల వాటి ప్యాకేజీకి, క్యారీ బ్యాగ్స్ ఇతరత్రా వాటి వల్ల గ్రీన్ హౌస్ వాయివు ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు.
- కాబట్టి ఆన్లైన్ షాపింగ్ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అందుకే అత్యవసరం అయితే తప్ప ఆన్లైన్ షాపింగ్ చేయకపోవడమే మంచిది.