Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దసరా పండుగ దగ్గరపడుతుండటంతో అందరూ తమ ఇళ్లను క్లీన్ చేసుకోవడంపై దృష్టిపెడుతున్నారు. ఇంటిలో అన్ని గదులను శుభ్రం చేసుకోవడం ఓ ఎత్తైతే.. జిడ్డు పేరుకుపోయిన వంటగదిని క్లీన్ చేసుకోవడం మాత్రం మరో ఎత్తు. అయితే కిచెన్‌ను సులభంగా ఎలా శుభ్రం చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం.
- ముందుగా గ్యాస్ స్టైవ్ మీద వంటసోడా చల్లాలి. ఆ తర్వాత సబ్బునీటిలో స్పాంజ్‌ను తడిపి స్టవ్‌ను శుభ్రం చేస్తే... దాని మీద పేరుకుపోయిన మరకలు, జిడ్డు పూర్తిగా పోతాయి.
- స్టవ్ మీద మొండి మరకాలు, నూనె జిడ్డు ఎక్కువగా ఉంటే వేడి నీరు, డిటర్జెంట్ పౌడర్‌తో ట్రై చేయండి.
- వంట గది పైకప్పుపై కూడా గ్యాస్, నూనె ప్రభావంతో ఆయిల్ పేరుకుపోయి ఉంటుంది. దీన్ని కూడా శుభ్రం చేసుకోవడం ఎంతో ముఖ్యం.
- దోమలు, ఈగలు, బొద్దింకలు వంటింట్లో చేరే ప్రమాదం ఉన్నందున... కిచెన్‌లోని పోపు డబ్బాలు, ఇతరత్ర పాత్రలను శుభ్రం చేసుకోవాలి. సోప్ కలిపిన వేడినీటితో వీటిని శుభ్రం చేసుకోవాలి.
- నిమ్మరసం, సోప్ కలిపిన వేడినీటితో తుడిస్తే కిచన్లోని గ్రానైట్ రాళ్లు, విండో గ్లాస్లు తళతళ మెరుస్తాయి. - మరకలు మరీ ఎక్కువగా ఉంటే వంటసోడా, నీటిని కలిపి ఆ మిశ్రమంతో స్పాంజ్ సాయంతో రుద్దితే శుభ్రం అవుతుంది.
- బర్నర్‌లో వ్యర్థాలు చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉంది. సూది సాయంతో ఈ వ్యర్థాలను తొలగించొచ్చు.
- వంట పాత్రలు వెలికితీసి... పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత లోపల పెట్టుకోవాలి