Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి యువత ఫిట్నెస్ కు అధిక ప్రాధాన్యమిస్తుంది. అందుకు అనుగుణంగానే వారి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ జిమ్ సెంటర్లలో కసరత్తులు చేస్తున్నారు. అయితే కొంతమంది బరువు తగ్గడానికి కత్రిమ పద్ధతులను అనుసరిస్తున్నారు. తద్వారా అనేక సైడ్ ఎఫెక్ట్స్‌ను కొని తెచ్చుకుంటున్నారు. మీ శరీర బరువు తగ్గడానికి అనేక సింపుల్ టిప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో రన్నింగ్ ఒకటి. ప్రతిరోజు రన్నింగ్ చేయడంతో అధిక బరువు నుంచి బయటపడటమే కాకుండా మీ బాడీని ఫిట్‌గా ఉంచుకోవచ్చు. రన్నింగ్ ఎలా ప్రారంభించాలి.. ఎలా ముగించాలి.. ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. వంటిపై వాటిపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.
- ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తే మీ బరువు తగ్గడంతో పాటు ఆ రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. రన్నింగ్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే మీ శరీరంలో ఉండే కొవ్వు తగ్గుతుంది. ప్రతి రోజు 1.5 కిలోమీటర్ల దూరం రన్నింగ్ చేస్తే మీ శరీరంలో 100 క్యాలరీల కొవ్వు కరుగుతుంది.
- మీ శరీరం బరువు తగ్గాలంటే ముందుగా శరీరంలోని క్యాలరీలను, కొవ్వును కరిగించాలి. బరువు తగ్గడం అనేది మీ బాడీ సైజ్, రన్నింగ్ సమయంపైన ఆధాపడి ఉంటుంది. రన్నింగ్ ద్వారా మీ అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు.
- సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను పదిలంగా ఉంచుకోవచ్చు.
- రన్నింగ్ ప్రారంభించే ముందు మీరు ఆరోగ్యకరంగా ఉన్నారా? లేదా? అనేది ముందుగా చెక్ చేసుకోవాలి.
- అకస్మాత్తుగా కాకుండా 5 నుంచి 10 నిమిషాల పాటు జాగింగ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లు చేసి మీ రన్నింగ్‌ను ప్రారంభించండి. దీని ద్వారా మీ బాడీని రన్నింగ్‌కు అనుకూలంగా మలుచుకోవచ్చు.
- ప్రారంభంలోనే ఎక్కువ దూరం రన్నింగ్ చేయకండి. నెమ్మదిగా మీ రన్నింగ్ సమయాన్ని పెంచుకోండి. మొదటి వారం రన్నింగ్ కంటే వాకింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. అంటే ఒక నిమిషం పాటు రన్నింగ్, రెండు నిమిషాల పాటు వాకింగ్ చేయండి. రెండో వారం ఒకటిన్నర నిమిషం పాటు రన్నింగ్, రెండు నిమిషాల పాటు వాకింగ్ చేయండి. ఈ విధంగా మీ రన్నింగ్ సమయాన్ని పెంచుకోండి.
- ప్రతి వారం మీ రన్నింగ్ సమయాన్ని అరనిమిషం పాటు పెంచుకోండి. మీరు ఎప్పుడైతే 10 నిమిషాల పాటు ఆగకుండా రన్నింగ్ చేయగలరో అప్పుడు మీ వాకింగ్ సమయాన్ని తగ్గించుకోండి.
- రన్నింగ్ చేసేటప్పుడు మీ ముఖం స్ట్రెయిట్‌గా, మీ భుజాలు రిలాక్స్‌గా, తల నిటారుగా, మీ ఛాతీ బలంగా ఉండేలా చూసుకోండి. తద్వారా మీరు బాగా శ్వాస తీసుకోగలుగుతారు.
- రన్నింగ్ సమయంలో మీ చేతులు, మోచేతులకు మధ్య 90 డిగ్రీలు ఉండేట్లు చూసుకోండి. మీ చేతులను రిలాక్స్‌గా కదల్చండి.
- రన్నింగ్ ప్రారంభించే గంట ముందు, రన్నింగ్ చేసిన 20 నిమిషాల తర్వాత నీటిని తాగండి.