Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్నిసార్లు మనం కొనుక్కొచ్చిన ప్యాకెట్ పాలు పాడయి పోతాయి. పాలు పాడై పోయాయి కదా ఇంకెందుకని పార బోస్తారు చాలా మంది. అలా పారబోయ కుండా మొక్కలకు పిచికారీ చేస్తే అవి బ్రహ్మాండంగా వుంటాయట. పాలలో అధికంగా ఉండే కాల్షియం కంటెంట్ మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. మొక్కలను కుళ్ళిపోకుండా చేస్తుంది. పాలలో అవసరమైన ప్రోటీన్లు, విటమిన్ బి కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి మొక్కల మొత్తం ఆరోగ్యానికి మంచివి.
ఎలా ఉపయోగించాలి?
ఒక భాగం పాలకు ఒక భాగం నీటిని కలపండి. ఆ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. మొక్కల ఆకులపై మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. పాలు అన్నీ గ్రహించబడ్డాయో లేదా తెలుసుకునేందుకు ఓ అర్థ గంట తర్వాత చూడండి. ఆకులపైన లేదంటే కాండంపైన ఎక్కడైనా పాలు మిగిలి వున్నట్లు కనిపిస్తుంటే ఓ వస్త్రాన్ని తీసుకుని తుడిచేయండి. అవి మొక్కలపై అలాగే వుంటే ఫంగల్ చేరే అవకాశం ఉంది.
జాగ్రత్త తీసుకోవాలి?
మరీ ఎక్కువ పాలను ఉపయోగించకూడదు. అలా వాడితే పాలలోని బ్యాక్టీరియా పెరుగుదల మొక్కకు హాని చేస్తుంది.