Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • నేడు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు
  • ఇంటర్ పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
  • ఘోరం రోడ్డు ప్రమాదం: 13 మంది దుర్మరణం
  • మంచు మనోజ్ స్నేహితుడు కన్నుమూత
  • నేడు ఉచిత ఆన్‌‌లైన్‌ జాబ్‌‌మేళా
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
చర్మాన్ని పట్టించుకోండి | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

చర్మాన్ని పట్టించుకోండి

Sat 17 Oct 03:58:50.086886 2020

చాలామంది మహిళలు తమ చర్మ రక్షణ గురించి పట్టించుకోరు. దీనితో ముడతలు, మచ్చలు ఏర్పడి చిన్న వయసులోనే వద్ధుల్లా కనబడతారు. లుక్‌ మారిపోయిన తర్వాత కసరత్తు చేసి ఆరోగ్యంగా కనబడాలని ప్రయత్నిస్తారు. అలా కాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే చర్మం పట్టులా మెరిసిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ కింది నూనెలను ఉపయోగిస్తుంటే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
బాదం నూనె : విటమిన్‌ ఇ, కె అధికంగా ఉండే బాదం నూనె చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని చైతన్యం చేయడమే కాకుండా మదువుగా చేయడానికి సహాయపడుతుంది. తద్వారా రంగు, స్కిన్‌ టోన్‌ మెరుగుపడుతుంది. బాదం నూనె రాసుకోవడం వల్ల సూర్యరశ్మి చర్మాన్ని దెబ్బతీయకుండా నిరోధించగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. స్నానం చేసిన తర్వాత బాదం నూనెతో చర్మాన్ని మసాజ్‌ చేయండి. వద్ధాప్య ఛాయలు దరిచేరకుండా వుండాలంటే ప్రతిరోజూ ఇలా చేయండి.
వేప ఎసెన్షియల్‌ ఆయిల్‌ : ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ వద్ధాప్యాన్ని ఆలస్యం చేయడంతో పాటు చర్మ వ్యాధులను నివారించగలవు. వేప నూనెలో పాలీఅన్‌శాచురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు, విటమిన్‌ ఇ ఉన్నాయి. కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని అతినీలలోహిత వికిరణం నుండి రక్షిస్తాయి. విటమిన్‌ ఇ చర్మంపై మచ్చలు, ముడతలు కనిపించడాన్ని తగ్గిస్తుంది. పావు కప్పు గోరువెచ్చని ఆలివ్‌ లేదా కొబ్బరి నూనెలో టేబుల్‌ స్పూన్‌ వేప ఎసెన్షియల్‌ ఆయిల్‌ కలపాలి. పడుకునే ముందు వత్తాకార కదలికలలో ఐదు నిమిషాలు ఈ మిశ్రమంతో మీ చర్మాన్ని మసాజ్‌ చేసి రాత్రిపూట వదిలివేయండి. మీరు దీన్ని రోజూ చేయవచ్చు.
ఆలివ్‌ నూనె : ఈ నూనెలో విటమిన్‌ ఎ, ఇతో పాటు అనేక ఇతర ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి మన చర్మంలోని ప్రధాన బిల్డింగ్‌ బ్లాకులలో ఒకటైన కొల్లాజెన్‌ అనే ప్రోటీన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. స్నానం చేసే ముందు రోజూ ఐదు నుండి పది నిమిషాలు మీ శరీరాన్ని గోరువెచ్చని ఆలివ్‌ నూనెతో మసాజ్‌ చేయండి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ చర్మాన్ని తేమగా ఉంచుతుంది. వద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
కొబ్బరి నూనె : కొబ్బరి నూనె కొల్లాజెన్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ముడతలు, మచ్చలు వంటి వద్ధాప్య సంకేతాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఫ్రీ-రాడికల్‌ నష్టంతో పోరాడటానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలోని లారిక్‌ ఆమ్లం యాంటీ బాక్టీరియల్‌ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మొటిమల బ్రేక్‌ అవుట్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెను పొడి చర్మం, తామర, సోరియాసిస్‌ చికిత్సకు ఒక ప్రసిద్ధ సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రికార్డు సృష్టించిన హిమా కోహ్లీ
ఐరన్‌ లోపించకుండా...
ఒత్తైన కురుల కోసం...
బుట్ట చేతుల బుట్టబొమ్మలు
కష్టాలకు కుంగిపోకుండా...
ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?
పిల్లలు పేచీ పెడుతుంటే..?
వీటిని గుర్తుంచుకోండి
మెడను కాస్త పట్టించుకోండి
మగవారికి ధీటుగా పని చేస్తా
క్రమంగా బరువు తగ్గండి
ఇలా తరిమేయండి...
మార్పు రావాలంటే ఓపిక పట్టాలి
వీటికి దూరంగా వుండండి
ఆలివ్‌ ఆయిల్‌ తో...
సంక్రాంతి వంటలు
బియ్యం పిండి చాలు...
పిల్లలకు నాణ్యమైన ఆహారం అందిస్తూ...
మెరిపించే పట్టుపరికిణి
మారుతున్న ఆలోచనలు
అలోవెరా వాడండి
ముత్యాల ముగ్గులు
రంగురంగుల ముగ్గులు
సంక్రాంతి ముగ్గులు
మన కష్టంలోనూ తోడుంటారు...
జిడ్డు చర్మానికి...
ముత్యాల ముగ్గులు
ఆత్మరక్షణే మా ఆయుధం
ముత్యాల ముగ్గులు
సంక్రాంతి ముగ్గు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.