Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గొలుసులు, గాజులతోపాటు రోజూ ధరించే ఆభరణంగా స్థిరపడిపోయాయి కాలి పట్టీలు. కాస్త అడుగులేసే వయసు రాగానే కూతురుకు ముందుగా మువ్వల పట్టీలు చేయించి పెడతారు అమ్మా నాన్నలు. వారి బుజ్జి బుజ్జి అడుగులకు ఆ మువ్వల గలగలలు తోడై ఇల్లంతా తిరుగుతుంటే మురిసిపోతారు. అయితే కాలి పట్టీలు కూడా కాలానుగుణంగా రూపురేఖలు మార్చుకుని ఆధునికతను సంతరించుకున్నాయి. పట్టు లంగా, వోణీ, జీన్స్, టీషర్ట్.. ఏది వేసుకున్నా వస్త్రాధరణకు తగినట్టుగా ఎన్నో పట్టీలు మార్కెట్లో లభిస్తున్నాయి. అంతేకాదు, మన అభిరుచికి తగ్గట్టుగా మార్చుకుని, మాచింగ్గా కూడా చేసుకోవచ్చు. సాధారణంగా కాలి పట్టీలు వెండి లేదా బంగారంతో తయారుచేస్తారు. కానీ ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల కాలి పట్టీలు అందుబాటులో ఉన్నాయి. చెక్క పూసలు, బ్లాక్మెటల్, రంగు రంగుల పూసలు, రాళ్లు, ముత్యాలు, మువ్వలు, గొలుసులు.. చివరకు ప్లాస్టిక్ గొట్టాలు, లెదర్తో చేసిన పట్టీలు కూడా దొరుకుతున్నాయి. అందుకే కాలేజీ అమ్మాయిలు ఇటువంటి అధునాతనమైన పట్టీలు పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బంగారు నగలకు ఏ మాత్రం తీసిపోని పనితనంతో రంగు రంగుల రాళ్లు, ముత్యాలు, పూసలు, క్రిస్టల్స్ పెట్టి తయారుచేసిన కాలి పట్టీలు కూడా దొరుకుతున్నాయి. ప్రస్తుతం పండగ, పెండ్లి, పార్టీ, పుట్టిన రోజు వచ్చినా డ్రెస్సుతోపాటు కొనుక్కునే మాచింగ్ గాజులు, నగలలో కాలిపట్టీలు కూడా చేరిపోయాయి. మరి అలాంటి మువ్వల పట్టీల డిజైన్లు కొన్ని మనమూ చూద్దాం...