Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలో మహిళలే సరైన ఆహారం తినట్లేదని సర్వేలు చెబుతున్నాయి. అందుకే కొన్ని ఆహారాలూ మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగడంతోపాటు అధిక బరువు సమస్యా పోతుంది. కొన్ని రకాల ఆహారాలు తింటే బరువు పెరుగుతాం.. కొన్ని తింటే బరువు తగ్గుతాం. ఏ ఆహారమైతే తిన్న తర్వాత వంద శాతం జీర్ణం అవుతుందో అలాంటి ఆహారం వల్ల బరువు పెరిగే సమస్య ఉండదు. కొవ్వు, డాల్డా, షుగర్, ఆయిల్ వంటివి అంత త్వరగా జీర్ణం కావు. అవి పేగుల్లో, ఆహార నాళాల్లో పేరుకుపోతాయి. రక్తంలో చేరి ఒళ్లంతా స్టాక్ అవుతాయి. అవే కొవ్వుగా మారి బాడీకి బరువును పెంచుతాయి. ఈ కొవ్వును తగ్గించుకోవడం ఓ సమస్య అయితే కొత్తగా మరింత కొవ్వు చేర కుండా చేసుకోవడం మరో ముఖ్యమైన అంశం. ఈ కొవ్వును కరిగించుకోవ డానికి వ్యాయామాలు చేయడం, వాకింగ్, జాగింగ్, వర్కవుట్లతో పాటూ... తినే ఆహారంలో చాలా మార్పులు చేసు కోవాలి. ముఖ్యంగా కొవ్వును కరిగించే ఆహారం తినాలి. అవేంటో తెలుసుకుందాం.
- కాలిఫ్లవర్ లో కేలరీలు తక్కువే. ఓ కప్పు కాలీఫ్లవర్‌లో 25 కేలరీలే ఉంటాయి. అందువల్ల మీరు దీన్ని ఎంత తిన్నా పెద్దగా బరువు పెరగరు. మహిళలకు ఇది సరైన ఆహారం. 46 నుంచి 51 ఏండ్ల వయసు వారు వేగంగా బరువు తగ్గాలంటే ఇదే తినాలి.
- ఓ కప్పు చిక్కుడు కాయల్లో 31 కేలరీలు ఉంటాయి. కొవ్వు ఉండదు. షుగర్ కూడా 3.6 గ్రాములే ఉంటుంది. పైగా సి,కె,ఎ విటమిన్లు, కెరాటెనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఉంటాయి. ఇది కూడా మహిళలకు బరువు తగ్గేందుకు సరైన ఆహారం.
- సలాడ్లు, శాండ్‌విచ్‌లలో కాప్సికం యాడ్ చేసుకుంటే బరువును వేగంగా తగ్గిస్తుంది. ఈ రంగుల ఆహారంలో కేలరీలు తక్కువే. పైగా కొవ్వును కరిగించే లక్షణం ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి పొట్ట, నడుం చుట్టూ ఉండే కొవ్వును కరిగిస్తుంది.
- క్యారెట్ కంటికే కాదు ఒంటికీ మంచిదే. ఇందులోనూ కేలరీలు తక్కువే. పైగా ఇందులోని బీటా కెరోటిన్, ఫైబర్ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. క్యారెట్లను జ్యూస్, సలాడ్, స్మూతీలుగా తీసుకోవచ్చు. కొవ్వును బాగా కరిగిస్తుంది.
- ఆకుకూరల్లో పోషకాలు బాగా ఉంటాయి. కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఈ ఫైబర్ వల్ల అనవసరంగా ఏదీ తినబుద్ధి కాదు. స్నాక్స్ వంటివి ఎక్కువ తినకుండా ఇది అడ్డుకుంటుంది. తద్వారా బరువు తగ్గుతారు.
- యాపిల్, పియర్స్ ఈ రెండూ బరువు తగ్గడానికి సరైన ఆహా రాలు. ఎందుకంటే వీటిలో వేడిని తగ్గించే లక్షణం ఉంటుంది. ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ వల్ల యాపిల్, పియర్స్ వంటివి తిన్నాక... పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. ఇంకేమీ తినబుద్ధి కాదు. పైగా వీటిలో కేలరీలు చాలా తక్కువ. కాబట్టి ఎన్నితిన్నా బరువు పెరగరు.
- సీజన్లో వచ్చే స్ట్రాబెర్రీల్లో సీ విటమిన్, ఫైబర్ ఎక్కువ. అందువల్ల ఇది కొవ్వును కరిగించగలదు. ఓ కప్పు స్ట్రాబెర్రీలు తింటే... మీకు రోజువారీ కావాల్సిన విటమిన్ సీ... 163 శాతం లభిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. కాబట్టి ఎంతో ఆరోగ్యం.