Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి 28 రోజులకు ఒకసారి క్రమం తప్పక వచ్చే రుతుస్రావం మరుసటి నెలలో తప్పిపోవడం గర్భం వచ్చింద నటానికి స్పష్టమైన సంకేతం. అయినప్పటికీ, గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాల్లో గర్భం ప్రారంభ లక్షణాలను మనం గమనించడం ప్రారంభించవచ్చు. కొన్ని సాధారణ లక్షణాలు ఇలా వుంటాయి.
వక్షోజాలలో మార్పులు : హార్మోన్ల మార్పుల వల్ల వక్షోజాలు మరింత భారీ, సున్నితమైన, మృదువుగా కనిపిస్తాయి. గర్భం దాల్చిన 1-2 వారాల తర్వాత ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
అలసట : గర్భం దాల్చిన ప్రారంభ దశలలో అధిక ప్రొజెస్టెరాన్ స్థాయిలు కారణంగా అది అలసట, నిద్రను కలిగిస్తాయి.
ఆహార కోరికలు, విరక్తి : కొన్ని వాసనలు కొంతమందికి వికారం కలిగించవచ్చు, మరికొందరు ఒక నిర్దిష్ట ఆహారం కోసం ఆరాటపడవచ్చు.
తలనొప్పి : హార్మోన్ల స్థాయి పెరగడం గర్భం ప్రారంభ దశలో తలనొప్పికి కారణమవుతుంది. తలనొప్పి వివిధ దశలలో కూడా సంభవిస్తుంది.
తరచుగా మూత్రానికి : తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపిస్తుంది. శరీరంలో గర్భధారణ హార్మోన్ల స్థాయిలు పెరగడం కిడ్నీ, కటి ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.దీని వల్లనే ఈ లక్షణం కనిపిస్తుంది.
వికారం : గర్భం దాల్చిన మూడు వారాల్లోనే వికారం మొదలవుతుంది. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. చాలామంది మహిళలకు గర్భం దాల్చిన మొదటి కొన్ని వారాలలో మాత్రమే వికారంగా ఉంటుంది. తర్వాత ఈ సమస్య తగ్గిపోతుంది.
తిమ్మిరి : కొంతమందికి ఉదరం, కటి లేదా నడుము భాగం తిమ్మిరిగా అనిపిస్తుంది. గర్భాశయంలో జరుగుతున్న మార్పుల వల్ల ఇది కావొచ్చు.
మలబద్ధకం : హార్మోన్ల మార్పులు జీర్ణవ్యవస్థకు అంతరాయం కలిగిస్తాయి. అందుకే గర్భం దాల్చిన ప్రారంభ వారాల్లో మలబద్ధకం ఉంటుంది.
కండ్లు తిరగడం : గర్భం దాల్చిన తర్వాత కొంతమందికి రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అలాంటపుడు పడుకుని లేచినపుడు మైకం వస్తుంది. మెదడుకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళే రక్త నాళాలలో మార్పుల వల్ల ఇది సంభవిస్తుంది.