Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్కెట్లో ఎక్కడ చూసినా కమలా పండ్లు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో లభించే పండ్లలో కమలా పండు ఒకటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సిట్రిక్ యాసిడ్ కారణంగా కాస్త పులుపు, రుచిని కలిగివుంటుంది. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ లేరు.
- పొట్ట ఉబ్బసం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కమలారసంలో ఉప్పు, మిరియాల పొడి కలిపి సేవిస్తే తగ్గిపోతాయి.
- మూత్రంలో మంట ఉన్న వారు కమలారసంలో లేత కొబ్బరి నీటిని కలిపి సేవిస్తే బాధ తగ్గుముఖం పడుతుంది.
- టీబీ, టైఫాయిడ్ లాంటి వాటితో బాధపడే వారికి కమలారసం రోగనివారిణిగా ఉపయోగపడుతుంది.
- ఈ పళ్ళ రసం శరీరంలో నిరోధకశక్తిని పెంచుతుంది.
- జలుబు, తుమ్ముల నుంచి దూరంగా ఉంచుతుంది. నిత్యం కమలారసం సేవించే వారు మంచి ఆరోగ్యంతో ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.
- ఈ పండును తినడం వల్ల కాలేయం, గుండె, మూత్రపిండాలు సక్రమంగా పని చేస్తాయి.
- దగ్గు, ఆయాసం, టీబీ ఉన్న వారు గ్లాస్ కమలారసంలో చిటికెడు ఉప్పు, చెంచా తేనె కలిపి తాగితే మంచి శక్తి కలిగి ఉత్సాహంగా ఉంటారు