Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చలికాలంలో తలపై చర్మం పొడిబారడం, దురద సాధారణంగా వస్తాయి. చల్లటి వాతావరణం వల్ల తలపై చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి కొన్ని టేబుల్ స్పూన్ల ఆలివ్ లేదా కొబ్బరి నూనెను టీస్పూన్ నిమ్మరసంతో కలపండి. ఈ మిశ్రమాన్ని కొన్ని సెకన్ల పాటు వేడి చేసి, ఆ తర్వాత తలపై అప్లై చేసి మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూ లేదా కండీషనర్‌తో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచిది.
- శీతాకాలంలో వాతావరణం మార్పు వల్ల జుట్టు మెరుపును కోల్పోతుంది. మీ జుట్టు మెరుస్తూ, సిల్కీగా ఉండటానికి ప్లాస్టిక్ దువ్వెన కాకుండా చెక్కతో చేసినదీ, అది కూడా పళ్ళు వేడవెడంగా ఉన్న దువ్వెను ఉపయోగించాలి. కొద్దిగ తేనె తీసుకుని జుట్టు మొత్తానికి రాయండి. ఇది కొంచెం జిగురుగా అనిపించినా తేనె జుట్టుకు బాగా పనిచేస్తుంది. ఇలా రాసిన తర్వాత తలను షవర్ క్యాప్‌తో కప్పి 30 నిమిషాలు ఉంచండి. తర్వాత షాంపూను ఉపయోగించి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనె రాయడం వల్ల జుట్టుకి మెరుపు వస్తుంది.
- చాలా మంది జుట్టును అరబెట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వుతారు. మరికొందరు దానిని టవల్‌తో కప్పి ఉంచుతారు. కొంతమంది హెయిర్ డ్రైయర్ వాడుతారు. వాస్తవానికి జుట్టు ఆరడానికి ఏమి చేయకూడదు, సహజంగానే జుట్టును ఆరనివ్వాలి. తడిగా ఉన్నపుడు దువ్వుతే జుట్టు పొడిమారిపోతుంది.