Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యాయామం చేయడం వల్ల కేవలం శారీరక దఢత్వమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా మన దరిచేరుతుంది. అయితే కొత్తగా వ్యాయామం ప్రారంభించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాటిని కచ్చితంగా పాటించాలి. అవేంటో తెలుసుకుందాం...
- వ్యాయామం చేయడం కోసం కొంతమంది నెలలకు నెలలు వేస్ట్ చేస్తుంటారు... పొద్దున లేవాలంటే బద్దకం. పొద్దెక్కదాకా పడుకోవడం.. చివరికి ఆదరాబాదరాగా లేచి ఆఫీసుకు పరుగులెత్తడం.. వీటితోనే చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తుం టారు. దీని నుంచి బయటపడాలంటే ముందు వ్యాయామం చేయడానికి మన మనసును సిద్దం చేసుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలనే కోరిక బలంగా మన మనసులో నాటుకుంటే ఇక మనను ఏ శక్తీ ఆపలేదు. మనసు నియంత్రణలో ఉంటే శరీరం ఆటోమేటిక్‌గా కంట్రోల్ లోకి వచ్చేస్తుంది.
- యువత ఏ టైంలో నైనా వ్యాయామం చేయొచ్చు. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యల్లేకుంటే నిశ్చింతగా చేయొచ్చు. కానీ 55 ఏండ్లు దాటిన మహిళలు కొంచెం కేర్ తీసుకోవాలి. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించి వ్యాయామం ప్రారంభించాలి.
- లక్ష్యం లేని జీవితం వధా అంటారు. మనం వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలంటే కచ్చితంగా లక్ష్యం నిర్ధారించుకోవాలి. అయితే కొత్తగా వ్యాయామం చేసేవాళ్లు చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకెళ్లడం ఉత్తమం. పెద్ద గోల్స్ పెట్టుకుంటే అవి సాధించలేని స్థితిలో చాలా మంది ముందులోనే వెనుకంజ వేసే ప్రమాదం పొంచి ఉంది.
- లక్ష్యాలు నిర్దేశించుకున్న తర్వాత అనుకున్న ఫలితాలు రాలేదని కుంగిపోకూడదు. ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడో తిన్న తిండిని కరిగించడం అనేది ఒక నెలో.. రెండు నెలలో అయ్యే పని కాదు. అది దీర్ఘకాల ప్రక్రియ.
వ్యాయామం ప్రారంభించిన కొత్తలోనే రోజుకు పది కిలోమీటర్లు పరిగెత్తి అలసిపోకండి. దాని వల్ల మొదటికే మోసం. ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తేనే శరీరంలోని కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. మొదట వాకింగ్, డ్యాన్సింగ్, సైక్లింగ్ వంటవి చేయడం ఉత్తమం. రన్నింగ్ చేయాలను కుంటే చిన్నగా ప్రారంభించాలి. రోజు కు కొంత దూరం పెంచుకోవాలే తప్ప ఒకేసారి చేయకూడదు.
- ఉదయం లేవగానే షూ లేస్ కట్టుకుని ఇంటి దగ్గర్నుంచే పరిగె త్తాలనే ఆదుర్దను వదిలేయండి. వ్యాయామాని కంటే ముందు మన బాడీని అందుకు సిద్దం చేయాలి. అందుకోసం వార్మప్ కచ్చితంగా చేయాలి. అలా చేయడం వల్ల మన బాడీని ఎక్సర్సైజ్ కు సిద్ధం చేసినట్లవువుతుంది.
- కరోనా నేపథ్యంలో బయటకు వెళ్లలేని పరిస్థితి. జిమ్‌కు వెళ్లాలన్నా భయమే. దీంతో చాలా మంది ఇంట్లోనే ఉంటూ వ్యాయామాలు చేస్తున్నారు. అలాంటి వాళ్లు కార్డియో వ్యాయామాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. ఆన్లైన్లో ఇందుకు సంబంధించి చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
అమెరికన్ హర్ట్ అసోసియేషన్ స్టడీ ప్రకారం.. రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం కచ్చితంగా చేయాలి. వాకింగ్, రన్నింగ్, జిమ్.. ఏదైనా సరే.. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు శ్రమించాల్సిందేనట. వారానికి ఐదు రోజులు కచ్చితంగా వ్యాయామాం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.