Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన వంటింట్లోనే ఎన్నో చిట్కాలున్నాయి. వాటి సాయంతో మొటిమల్ని వాటి తాలూకు మచ్చల్ని సులభంగా పోగొట్టుకోవచ్చు. పైగా ఈ చిట్కాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అదే మార్కెట్లో ఏ క్రీమో, లోషనో కొని వాడితే అది మన చర్మానికి పడకపోతే కొత్త సమస్యలు వస్తాయి. అందుకే సహజ సిద్ధమైన ఇంటి చిట్కాలు పాటిస్తే మేలు. ముఖం మరింత కాంతివంతంగా చేసుకుంటూ అన్ని చర్మ సమస్యలూ ఎలా పోగొట్టుకోవచ్చో తెలుసుకుందాం.
- తేనె, పాలు కలిపి ముఖానికి రాసుకోండి. పావు గంట తర్వాత నీటితో కడిగేయండి. చర్మం మృదువుగా, సాఫ్టుగా అవుతుంది. ముఖంలో గ్లో వస్తుంది. తాజాగా కనిపిస్తుంది. చలికాలంలో ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
- ఓ పండిన ఎర్రటి టమాటా తీసుకొని దాని నుంచి రసం తియ్యండి. అందులో నిమ్మకాయ రసం కలపండి. దాన్ని ముఖానికి పట్టిస్తే పావు గంట తర్వాత నీటితో కడిగేస్తే మీ చర్మం సాఫ్టుగా, కోమలంగా అవుతుంది. మచ్చలు, మొటిమలు ఆటోమేటిక్గా తొలగిపోతాయి. ఇలా రెండురోజులకు ఓసారి చేస్తే మేలు.
- నెయ్యి, గ్లిజరిన్ కూడా చర్మానికి సరైన ఇంటి చిట్కా. రెండు టీస్పూన్లు నెయ్యి, నాలుగు చుక్కల గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకుంటే మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. ఇది మీ చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
- పాలు, ఉప్పు, నిమ్మరసం మూడు కలిపి ముఖానికి రాసుకోండి. ఇది ఎండిపోయిన తర్వాత నీటితో ముఖం కడుక్కోండి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మ రంద్రాలు తెరచుకుంటాయి. మురికి అంతా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. తేడా మీరే చూస్తారు.
- బ్లూ ద్రాక్ష పండ్లు కూడా మీ స్కిన్ గ్లో అయ్యేలా చెయ్యగలవు. ద్రాక్షను జ్యూస్ లా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ముఖ్యంగా పెదవులు, నోటి చుట్టూ రాసుకోవాలి. 15 నిమిషాలు అలా వదిలేయాలి. చర్మంపై ఉండే సమస్యలన్నీ ఆటోమేటిక్గా తొలగిపోతాయి.
- క్యాబేజీ జ్యూస్, తేనె కలిపి ముఖానికి రాసుకుంటే ముడతలు, మచ్చల సమస్య తొలగిపోతుంది. అంతే కాదు.. చర్మం మెరుస్తుంది కూడా.