Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టమాటా ముక్కతో ముఖంపై మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే చర్మం జిడ్డు తొలగిపోతుంది.
- స్నానానికి పదిహేను నిమిషాల ముందు యాపిల్‌ను పలుచని ముక్కల్లా కోసి ముఖంపై ఉంచాలి. యాపిల్ ముక్కలు చర్మంలోని అధిక నూనెను పీల్చుకొని ఫలితంగా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
- జిడ్డు చర్మంతో బాధపడేవారికి నిమ్మరసం మంచి ఔషదం. నిమ్మరసంలో కొద్దిగా నీరు కలపండి. ఆ రసంలో దూదిని ఉండలుగా చేసి వేయాలి. వాటిని కొద్ది సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తర్వాత ఒక్కో ఉండను ముఖానికి రుద్ది శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల చర్మంపై మురికి తొలగిపోతుంది. చర్మానికి తేమ అందుతుంది. దీనివల్ల ముఖం జిడ్డుగా మారదు.
- అరకప్పు పెసరపిండిలో సరిపడా పెరుగు, కాస్త నీళ్లు కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరాక చల్లని నీటితో కడిగేసుకుంటే జిడ్డు చర్మాన్ని తాజాగా, తేటగా మారుస్తుంది. దీని తరవాత సబ్బు రుద్దుకోకూడదు.
- అర స్పూన్ బేకింగ్ సోడాలో కాస్త నిమ్మరసం కలపండి. మొటిమలూ, యాక్నె సమస్య ఉన్న చోట దాన్ని పూతలా రాయండి. కాసేపటి తర్వాత తడి చేతితో మర్దన చేసి ఆ పూతను తీసేయండి. దీని వల్ల నూనె గ్రంథులు మూసుకుపోయి జిడ్డు సమస్య తగ్గుతుంది. మృతకణాలు తొలగిపోతాయి. మొటిమలు తగ్గుతాయి.
- జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్లు మేకప్ వేసుకునే ముందు నీళ్లు కలిపిన నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోని పది నిమిషాలయ్యాక కడిగేయాలి.