Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శీతాకాలం రాగానే చర్మం పగుళ్లు, పెదవులు పొడిబారడంతో పాటు పగుళ్లు సమస్య అధికమవుతుంది. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
- ఆలివ్ ఆయిల్ లో నిమ్మరసాన్ని కలిపి పెదాలకు రాయడం వల్ల పెదాలు పగలవు.
- ఆలివ్ ఆయిల్ తో తేనెను కలిపి ముఖానికి రాసి, కొంతసేపయిన తర్వాత ముఖాన్ని మెత్తని సున్నిపిండితో రుద్దుకుని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
- చర్మం పొడారిపోయి నట్లుగా కళావిహీనంగా ఉంటే ఆలివ్ ఆయిల్లో పాలనుకానీ, పాలమీగడను కానీ కలిపి ఆ మిశ్రమంతో మృదువుగా మసాజ్చేసి, ఆ తర్వాత నీటితో చర్మాన్ని శుభ్రపరిస్తే చర్మానికి మంచి కాంతి, నునుపుదనం, తేమ ఏర్పడతాయి.
- ఆలివ్ ఆయిల్ ను గోళ్ళమీద ప్రతిరోజూ రాస్తూంట, గోళ్ళ ధృడత్వం, అందం పెరుగుతాయి.
- ఆలివ్ ఆయిల్ లో టమాటోరసం, క్యారెట్జ్యూస్, పెరుగుకలిపి మచ్చల మీద రాస్తూంటే, గోళ్ళ దృఢత్వం, అందం పెరుగుతాయి.
- ఆలివ్ ఆయిల్ లో కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి, తలకురాచుకుని, తలస్నానం చేసినట్లయితే వెంట్రుకలు మెత్తగా మారుతాయి. కేశాలు పొడవుగా పెరుగుతాయి.