Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరీరంలోని విష వ్యర్థాల్ని కరివేపాకులు తరిమేస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యకు చెక్ పెడతాయి.
- డయేరియా సమస్యకు సరైన పరిష్కారం కరివేపాకులు. వీటిలో కారిబాజోల ఉంటుంది. అది విరేచనాలకు బ్రేక్ వేస్తుంది. అందుకే ప్రతీ కూరలో కరివేపాకులు వేస్తారు.
- కరివేపాకు దగ్గు, జలుబులకు చెక్ పెడుతుంది. అందుకే ఈ ఆకులను చలి, వానాకాలంలో తప్పక వాడతారు.
- ఈ ఆకులలోలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గిస్తుంది.
- కరివేపాకుల్లో యాంటీఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. అవి బాడీలో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తాయి. డయాబెటిస్ సమస్య ఉన్నవారు కరివేపాకులు తింటే మేలు.
- కిడ్నీ సమస్యలతో బాధపడేవారు... కరివేపాకుల్ని ఉడకబెట్టి... తాగితే మంచిది. యూరినరీ సమస్యలకు కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది.
- సరైన పోషకాలు లేని వారికి జుట్టు తెల్లబడుతుంది. అలా జరగకుండా ఉండేందుకు కరివేపాకులు సాయపడతాయి. జుట్టు బాగా పెరిగేందుకు కూడా ఇవి సహకరిస్తాయి.
- శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు కరివేపాకులు బాగా పనిచేస్తాయి. చర్మాన్ని కూడా కాపాడతాయి.