Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనిల్‌కుమార్‌
  • వామన్‌రావు దంపతుల హత్యతో ప్రమేయం ఉన్న వారికి శిక్ష పడేలా చేస్తాం
  • ఆన్‌లైన్‌ పరీక్ష ఉందంటూ గదిలోకి వెళ్లి ఉరేసుకున్న విద్యార్థిని
  • లోయలో పడిపోయిన ఆర్మీ వాహనం.. జవాన్ మృతి
  • యువ‌తిపై ప్రేమోన్మాది దాడి..పరిస్థితి విషమం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
నీట్‌ గా కనిపించడం లేదా..? | మానవి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • మానవి
  • ➲
  • స్టోరి

నీట్‌ గా కనిపించడం లేదా..?

Tue 26 Jan 04:54:35.395464 2021

ఒక్కోసారి ఎంత క్లీన్‌ చేసినా ఇల్లు నీట్‌గా కనిపించనే కనిపించదు. శుభ్రం చేసీ చేసీ విసుగొస్తుంది.. చిరాకొస్తుంది.. ఏం చేయాలో తెలియదు. ఎలా క్లీన్‌ చేస్తే ఇల్లు ఇల్లులా కనపడుతుందో అర్ధం కాదు. అయితే మనకి తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుంది. అవేమిటో తెలుసుకుంటే ఆ తప్పులు మన ఇంట్లో జరగకుండా జాగ్రత్తపడొచ్చు. మరి అవేంటో చదువుదామా...
- నేల మీద ఏం వస్తువులు ఉండకూడదు అనే లక్ష్యంతో ఒక్కోసారి అవన్నీ తీసి అల్మారాల్లో, టేబుల్‌ మీద పెట్టేస్తూ ఉంటాం. దాంతో కౌటర్స్‌, సర్ఫేసులు క్లట్టర్‌తో నిండిపోయి ఉంటాయి.
- కౌంటర్స్‌ మీద అసలేమీ లేకపోయినా కూడా చూడ్డానికి అంత బావుండదు. అందుకని కాఫీ మేకర్‌, మిక్సీ లాంటివైనా కౌంటర్స్‌ మీద ఉండాలి.
- ఫ్రిజ్‌ మీద ఇన్విటేషన్స్‌, టేకెవే మెన్యూలు కిక్కిరిసిపోయి ఉంటాయి. ఆ ఇన్విటేషన్స్‌ తాలూకు శుభకార్యాలు ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి కూడా. కనీసం నెలకి ఒకసారైనా ఫ్రిజ్‌ మీద ఉండేవన్నీ క్లీన్‌ చేయాలని రూల్‌ పెట్టుకోండి.
- మీ కిచెన్‌ అల్మారాÛల్లో డబ్బాలు ఒకదాని మీద ఒకటి పడిపోతూ ఉన్నా కూడా నీట్‌గా కనిపించదు. మీకు వాడుకోవడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. వాటిని ఎప్పటికప్పుడు సర్దేసుకోండి.
- కొంత మంది ఇంట్లోకి వస్తూనే చెప్పులు, షూస్‌, బ్యాగ్స్‌, పిల్లల లంచ్‌ బ్యాగ్స్‌ అన్నీ గుమ్మం పక్కనే పెట్టేస్తారు. వీటికి లోపల ఒక ప్లేస్‌ కేటాయించి ఆ ప్లేస్‌లోనే ఉంచాలని ఇంట్లో అందరికీ చెప్పండి.
- గోడల మీద ఫొటోలు, క్యాలెండర్లు, గోడ గడియారాలు వంటివన్నీ చాలా ఉన్నాయంటే ఇల్లు ఇరుగ్గా అనిపిస్తుంది. గోడల మీద ఎన్ని తక్కువ పెట్టగలరో చూసి అన్నే ఉంచండి.
- ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ బొమ్మలకే ఎంత ప్లేస్‌వున్నా సరిపోదు. అమ్మమ్మలు, తాతయ్యలు, మామయ్యలు, అత్తలు, ఫ్రెండ్స్‌ అందరూ పిల్లలకి బొమ్మలు కొంటూనే ఉంటారు. వాటిని రెగ్యులర్‌గా క్లియర్‌ చేయకపోతే ఇంట్లో ఇంకేం పెట్టుకోవడానికీ చోటుండదు.
- ఇంటినిండా ప్లగ్‌ పాయింట్స్‌, వాటిల్లో చార్జెర్స్‌ అవి నేల మీద పడుతూ ఉంటాయి. వాటికి కాలు చిక్కుకుంటే పడతారు కూడా. వాడని వాటిని లోపల పెట్టేయండి.
- మీరు మంచి మంచి ఆర్ట్‌ పీసెస్‌ని కలెక్ట్‌ చేసి ఉండవచ్చు. కానీ అవన్నీ డిస్‌ప్లే చేస్తే అన్నీ ఇరుకిరుగ్గా పెట్టినట్టు ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు మీ కలెక్షన్‌ని మారుస్తూ ఉండండి.
- ఉతకాల్సిన బట్టలు ఒక గుట్టలా పడేసి ఉన్నా కూడా ఇల్లు నీట్‌గా కనిపించదు. రెగ్యులర్‌గా అవన్నీ వాషింగ్‌ మెషీన్‌లో వేసేస్తూ ఉండాలి. లేదా హ్యాండ్‌ వాష్‌ ప్రిఫర్‌ చేస్తే ఆ పని చేసేయాలి. కనీసం వాటిని మూత ఉన్న టబ్‌లో పెట్టాలి.
- ప్రతి వస్తువుకీ ఇంట్లో ఒక ప్లేస్‌ ఉంటుంది. ఆ ప్లేస్‌లో కాకుండా ఆ వస్తువులని ఇంకొక ప్లేస్‌లో పెట్టినా కూడా చూడ్డానికి బాగుండదు. కాబట్టి ఏ వస్తువు ఎక్కడ వుండాలో ముందే నిర్ణయించుకోండి.
- మీకు అక్కర్లేని, మీరు ప్రస్తుతం వాడని వస్తువులు మీ ఇంట్లో ఎన్నో ఉండి ఉంటాయి. ఆరు నెలలకి ఒకసారి ఈ క్లీనింగ్‌ ప్రోగ్రాం పెట్టుకుంటే ఇల్లు హయిగా ఉంటుంది.
- కొంత మంది షూస్‌ని ఇంటి బయట విడిగా పెట్టేస్తూ ఉంటారు. ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే కనీసం ఏడెనిమిది జతల చెప్పులు కచ్చితంగా ఉంటాయి. వీటిని ఒక మంచి షూ ర్యాక్‌లో పెట్టకపోతే మీ ఇంటి గుమ్మం ముందే చెత్త పేరుకుపోతుంది.
- బాల్కనీలో తడి తడిగా ఉన్న మాప్స్‌ పెట్టేస్తే అవి వాసన వస్తూ ఉంటాయి. ఫ్రెష్‌గా, క్లీన్‌గా ఉన్న మాప్స్‌ మంచి ఇంప్రెషన్‌ని ఇస్తాయని గుర్తుపెట్టుకోవాలి.
- డైనింగ్‌ టేబుల్‌ మీద నేతి గిన్నె, పచ్చళ్ళ సీసాలు, ఉప్పు, పెప్పర్‌, స్పూన్‌ స్టాండ్‌, టిష్యూస్‌.. అన్నీ కలిసి డైనింగ్‌ టేబుల్‌ని ఇరుగ్గా చేసేస్తాయి. దేనికవి విడివిడిగా పెట్టుకోవాలి.
- మూత లేని డస్ట్‌ బిన్‌ ఒక్కటి ఉంటే చాలు మీరు ఇల్లు ఎంత నీట్‌గా ఉంచినా సరే చూడ్డానికి బావుండదు.. వాసన కూడా వస్తుంది. అందుకే వెంటనే మూత ఉన్న బిన్‌ పెట్టుకోండి. 

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బామ్మ సాగుబడికి పద్మశ్రీ
కాటన్‌ కుర్తీల్లో కూల్‌ గా...
ఫ్యాషన్‌ తో పొంచివున్న ప్రమాదమే...
సుకుమారంగా పెంచొద్దు
ఆరోగ్యం ఉంటే ఎన్ని ప్రయోజనాలో
ఈ సంకేతాలు ప్రమాదం
విష పదార్థాలను తరిమేస్తుంది
ఎంపికలో జాగ్రత్తలు అవసరం
సడన్‌ గా మానేస్తున్నారా..?
నిమ్మ ఆకులతో...
పోల్చితే భరించలేను
మాట వినడం లేదా..?
అదే పనిగా చూస్తుంటే
వాడేసిన వాటితోనే వైభవంగా
టీనేజర్లకు అత్యంత ప్రమాదం
క్యాప్సికంతో స్పై‌సీగా రుచిగా
వ్యాయామం చేయాల్సిందే
నల్లని జుట్టు కోసం...
వివక్షను తరిమికొట్టేందుకు
ముద్దులొలికే బుజ్జాయిలకు
ఇలా ఉంటే మారాల్సిందే...
పెరుగు తింటే చాలు
సాఫీగా సాగిపోవాలంటే..?
చర్మ సంరక్షణకు...
ఇలా శుభ్రం చేయండి
ఉదయాన్నే వీటిని తినొద్దు
యువ చైతన్య 'దిశ'
మాట విన్నాడు బాగుపడ్డాడు
ఇంటి నుండే పనిచేస్తున్నారా?
పాత వస్తువులతో పసందుగా
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.