Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందమైన చిన్ని పాపాయిలకు అంతకంటే అందమైన డ్రెస్సులు వేసి మురిసిపోతారు తల్లిదండ్రులు. ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే ఎన్నో రకాల మోడ్రన్ దుస్తులు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. పాలుగారే పసిపాపాయిలకు ఏ డ్రెస్సు వేసినా ముద్దుగానే ఉంటారు. అయినా తన బిడ్డ అందరిలో కాస్త ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటుంది తల్లి మనసు. ఎప్పుడూ గౌన్లూ, లాంగ్ ఫ్రాక్స్, టీ షర్ట్స్ వేసుకుని పిల్లలకు కూడా బోర్ కొడుతుంది. అందులో ఇలా స్కర్ట్ టైప్‌లో ఉండే దుస్తులను వేసి చూడండి మీరనుకున్నట్టే ప్రత్యేకంగా కనిపిస్తారు.