Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరో నాలుగు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు కొత్త ఆలోచనలతో.. వాటిని ఆచరణలో పెట్టుకునేందుకు కొత్త మార్గాలలో పయనిస్తున్నారు. గతంలో కంటే కూడా తమ ఆలోచనకలు పదును పెట్టారు. విజయాలు సాధిస్తున్నారు. ఎవరికైనా విజయం అనేది అంత తేలికైనది కాదు. ఇక మహిళల సంగతికి వస్తే అది మరింత కష్టం. మనకంటూ ఓ మెరుగైన ప్రపంచం కోసం ఎన్నో ఏండ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. సంవత్సరాల కషి, నిరంతర ప్రణాళిక ఫలితంగా ఇప్పుడిప్పుడు తమ కలలను నెరవేర్చుకుంటున్నారు. మరెందరికో ఆదర్శంగా నిలిచారు. అటువంటి కొందరు మహిళల గురించి నేటి మానవిలో...
భారత క్రీడాకారిణి సాక్షి మాలిక్, మిథాలీ రాజ్, మేరీ కోమ్, కరణం మల్లేశ్వరి, సైనా నెహ్వాల్, హిమా దాస్, పి.వి సింధు... వీరంతా క్రీడా ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిన చాలా భిన్నమైన మహిళలు. కానీ వీరందరిలో కనిపించే ఒక అంశం ఉంది. ప్రతి ఒక్కరూ వారి కెరిర్లో ఎదగడానికి ఎన్నో కష్టాలు అధిగమించాల్సి వచ్చింది. వాటి మధ్య ఒలింపిక్ పతకాల విజయాలు, గొప్ప క్రీడా నైపుణ్యంతో పాటు ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా తమ స్థానాన్ని నిలుపుకునేందుకు విపరీతంగా శ్రమించారు.
యుద్ధ విమానాన్ని నడిపి...
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన ఓ సాధారణ అమ్మాయి అవని చతుర్వేది. మూస పద్ధతులను వదిలించుకుని తన భవిష్యత్ కోసం కలలు కన్నది. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మిగ్ -21 ఫైటర్ జెట్‌ను ఎగరేసిన తొలి మహిళా పైలట్‌గా నిలిచి ఇటీవల చరిత్ర సష్టించింది. ఎదురయ్యే సమస్యలకు కుంగిపోకుండా ధైర్యంగా విజయాలను అందుకుంది. పట్టుదలతో ప్రణాళిక బద్ధంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.
రూత్ బాడర్ గిన్స్బర్గ్
గిన్స్బర్గ్... మొదటి యూదు మహిళ 1993 నుండి యునైటెడ్ స్టేట్స్ సుప్రీంకోర్టులో పని చేసిన రెండవ మహిళ. ఈమె న్యూయార్క్ లోని బ్రూక్లిన్‌లో ఓ సామాన్య కుటుంబం నుండి వచ్చింది. 1960ల ప్రారంభంలో కొలంబియా లా స్కూల్ ప్రాజెక్ట్ ఆన్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్‌తో కలిసి పనిచేసింది. స్వీడిష్ భాష కూడా నేర్చుకుంది. మరొకరితో కలిసి లింగ సమానత్వంపై ఓ పుస్తకాన్ని రచించారు. ఎన్నో విషయాల్లో ఓ భిన్నంగా మహిళగా నిలిచారు. ఆమె అనేక విషయాలలో ప్రథమంగా చేసిన మహిళగా నిలిచారు. చట్టాల్లో మహిళల కోసం రావాల్సిన మార్పుల కోసం వాదించారు.
కమలా హారిస్
ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు. తెల్ల జాతీయురాలు కాని మొదటి మహిళగా కమలా హారిస్ ఈ స్ఠాయికి చేరుకుని చరిత్ర సృష్టించారు. అమెరికన్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తగా ఇప్పుడు గుర్తింపు పొందారు.