Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరీరాన్నీ, ఆరోగ్యాన్నీ బ్యాలెన్స్‌గా ఉంచుకోవడానికి జిమ్ ఉండాల్సిన పని లేదు. రోజూ ఉదయం వేళ అరగంట పాటూ నడిచారంటే దాని వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
- రోజూ ఉదయం లేచాక మార్నింగ్ వాక్ని మీ డైలీ హాబీస్‌లో భాగం చేసుకోండి. దాని వల్ల మీకు ఎలాంటి నష్టమూ ఉండదు. అన్నీ లాభాలే ఉంటాయి. రకరకాల అనారోగ్యాలు మీ దరి చేరవు.
- రోజూ ఉదయం వేళ అరగంటపాటూ వాకింగ్ చేస్తే చురుకుదనం బాగా పెరుగుతుంది. ఆ రోజంతా చలాకీగా ఉంటారు. ఇందులో మ్యాజిక్ ఏమీ లేదు. వాకింగ్ చేసేటప్పుడు మీరు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. బయట మొక్కల నుంచి మీకు మంచి ఆక్సిజన్ లభిస్తుంది. - ఫలితంగా మెదడు చురుగ్గా మారుతుంది. ఎన్నో పరిశోధనల్లో ఇది నిజం అని తేలింది.
- వాకింగ్ చేసేటప్పుడు వేగంగా నడవండి. మీ చేతులూ, కాళ్లూ బాగా ఊపండి. తద్వారా మీ శరీరం వేడెక్కుతుంది. బాడీలో చెడు కొవ్వు కరుగుతుంది. రక్త నాళాల్లోని చెడు కొవ్వు కరుగుతుంది. గుండెకు రక్తం సరఫరా చక్కగా అవుతుంది. గుండె జబ్బులు రావు. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు 19 శాతం తగ్గుతాయి.
- వాకింగ్ చేస్తే బ్రెయిన్‌కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. తద్వారా చాలా నాడులు చైతన్యం అవుతాయి. కొత్త కణాలు పుట్టుకొస్తాయి. మెదడుకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. దాంతో మెమరీ పవర్ పెరుగుతుంది.
- అధిక బరువు ఉన్నా, చెడు కొవ్వు బాడీలో ఉన్నా అధికంగా చెమట పట్టి సరిగా నిద్ర పట్టదు. ఎక్కువగా 55 నుంచి 65 ఏండ్ల వారికి నిద్ర సమస్య తలెత్తుతుంది. వాకింగ్ చేసేవారి శరీరం చురుగ్గా ఉండటంతో నిద్ర కూడా బాగా పడుతుంది.
- ఉదయం వేళ వాకింగ్ చేస్తుంటే పక్షుల కిలకిలలు, ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. అది మనకు కొన్ని ఆహ్లాదకర దృశ్యాలను ఇస్తుంది. అవి రోజంతా మన మనసులో కనిపిస్తూ ఉంటాయి. తద్వారా మీరు రోజంతా మంచి మూడ్‌తో ఉంటారు. అందుకే వారానికి 5 రోజులైనా వాకింగ్ చెయ్యాలని అంటారు.
- వాకింగ్ చేస్తుంటే శరీరం గట్టిగా అవుతుంది. కొవ్వంతా కరిగిపోయి ఎముకలు, కండరాలు బలంగా అవుతాయి. పైగా ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పుల వంటివి రావు. కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా వాకింగ్ చెయ్యాలని నిపుణులు అంటున్నారు.
- కరోనా లాంటి వైరస్ల దాడి నుంచి తప్పించుకోవాలంటే మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. వాకింగ్ ద్వారా అది వస్తుంది. రోజురోజుకూ మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.
- రోజూ అరగంటపాటూ వాకింగ్ చేస్తే 150 కేలరీలు కరుగుతాయి. అదే సమయంలో తక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.
- డయాబెటిస్ అనేది రకరకాల కారణాలతో వస్తుంది. సరైన లైఫ్‌స్టైల్ ఉంటే షుగర్ వ్యాధి రాదు. మంచి ఆహారం తింటూ, వాకింగ్ చేస్తూ ప్లాన్ ప్రకారం రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటే షుగర్ వ్యాధిని దూరం పెట్టుకోవచ్చు.