Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్యకాలంలో చాలా మంది తమ ఖాళీ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా క్రియేటివ్‌గా ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు. సమయాన్ని కుటుంబ సభ్యులందరితో కలిసి గడుపుతూనే తమ నైపుణ్యాన్ని బయటపెట్టే యాక్టివిటీస్‌పై కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. కొంతమంది తమలో దాగున్న పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటకు తీస్తున్నారు. అలాగే బేకింగ్‌పై కూడా దృష్టిపెడుతున్నారు. మరికొంతమంది స్కిన్ కేర్, హెయిర్ కేర్ అలాగే ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నారు. మీరు కూడా టైమ్‌ను క్రియేటివ్‌గా వాడాలనుకుంటున్నారా? మీరు మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఏదైనా క్రియేటివ్ యాక్టివిటీ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే మీ ఇంట్లో ఖాళీగా ఉన్న ఫ్లవర్ పాట్తో అద్భుతమైన కళాఖండాలు చేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...
- క్యాండిల్ హోల్డర్లా ఫ్లవర్ పాట్‌ను వాడవచ్చు. ఇందుకోసం గ్రాండ్ అలాగే పెద్ద ఫ్లవర్ పాట్స్ అవసరం లేదు. చిన్న చిన్న ఫ్లవర్ పాట్స్ సరిపోతాయి. వీటిలో సెంటెడ్ అలాగే చిన్న చిన్న క్యాండిల్స్‌ను అలంకరించవచ్చు. మీరు ఫ్లవర్ పాట్ బయటివైపు చక్కగా పెయింట్ చేసేయవచ్చు. అప్పుడు పాట్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీ ఇంట్లోని చక్కటి కార్నర్స్‌లో ఈ పాట్స్‌ను పెట్టవచ్చు.
- స్టోన్ వేర్, పోర్సెలైన్ వంటి సెరామిక్స్ మైక్రోవేవ్ ఫ్రెండ్లీ కాబట్టి వీటిని చిన్న చిన్న కేక్స్‌ను బేక్ చేయడానికి వాడవచ్చు. కేక్ సిద్ధమవ్వగానే కేక్‌ను సర్వ్ చేయవచ్చు కూడా. ముఖ్యంగా, ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇది ఎంతో ఉపయోగ పడుతుంది.
- ఖాళీ ఫ్లవర్ పాట్‌ను హోమ్ గార్డెన్లో ప్లేస్ చేయవచ్చు. బర్డ్ ఫీడింగ్‌లా వాడవచ్చు. అలాగే ఈ పాట్‌ను పెయింట్ చేయవచ్చు. మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేయవచ్చు. మీరు ప్రత్యేకంగా తయారుచేసిన ఈ బర్డ్ పాట్ మీలోని క్రియేటివిటీని బయటికి తేవడానికి ఎంతో ఉపయోగపడుతుంది.
- ఖాళీ ఫ్లవర్ పాట్‌ను పెన్సిల్ లేదా పెన్ హోల్డర్లా కూడా వాడవచ్చు. ఒకవేళ ఫ్లవర్ పాట్ ఇంకొంచెం పెద్దదైతే పెయింట్ బ్రషెస్‌ను కూడా అందులో పెట్టవచ్చు. స్కెచ్ పెన్స్‌తో పాటు మరిన్ని స్టేషనరీ ఐటమ్స్ ను ఇందులో యాడ్ చేయవచ్చు.
- ఒకవేళ మీ ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉంటే మీ ఫిష్‌లకు ఎక్స్ప్లోర్ చేసేందుకు మీరు కొత్త ప్లేస్ ఇవ్వవచ్చు. ఫిష్ ట్యాంక్‌లో వాటర్ పాట్‌ను ప్లేస్ చేసి వాటర్ పాట్‌కు కొన్ని హోల్స్ చేస్తే ఫిషెస్ అటూ ఇటూ సరదాగా తిరుగుతుంటాయి.
- ఫ్లవర్ పాట్‌ను శుభ్రంగా కడిగి కట్లరీ స్టాండ్ లేదా హోల్డర్లా వాడవచ్చు. లేదా ఫుడ్ లేదా వాటర్‌ను పెట్టే కంటైనర్లా కూడా వాడవచ్చు.
- మీ గార్డెన్లో పూసిన పువ్వులను, కాసిన కూరగాయలను చక్కగా శుభ్రం చేసి ఈ ఫ్లవర్ పాట్స్లోకి తీసుకోవచ్చు.
- గార్డెనింగ్ టూల్స్ అన్నిటినీ ఫ్లవర్ పాట్లో పెట్టవచ్చు. ఈ ఫ్లవర్ పాట్‌ను గార్డెన్‌కి అందుబాటులో ఉంచుకుంటే గార్డెనింగ్ చేయాలన్న ఉత్సాహం మీలో కలిగినప్పుడల్లా ఇందులో ఉన్న టూల్స్‌ను చకచకా వాడవచ్చు.
- గార్డెన్లో సరదాగా కుటుంబసభ్యులతో ఫుడ్‌ను ఆస్వాదించేటప్పుడు ఫుడ్‌ను కవర్ చేసేందుకు కూడా ఫ్లవర్ పాట్స్‌ను ఉపయోగించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్లి ఫుడ్‌ను ఆస్వాదించలేని పరిస్థితి కాబట్టి ఇంట్లో, బాల్కనీలో, మేడమీద ఇలా అందుబాటులో ఉన్న ప్రదేశాల్లోనే డిఫెరెంట్‌గా ఫుడ్‌ను ఆస్వాదించడానికి చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అలా గార్డెన్ వంటి ప్రదేశాల్లో ఫుడ్ పార్టీ చేసుకుంటున్నప్పుడు శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకున్న ఫ్లవర్ పాట్స్‌ను ఫుడ్ కవర్‌గా వాడుకోవచ్చు . ఫ్లవర్ పాట్ కాస్తంత పెద్దదైతే దాన్ని టేబుల్‌గా కూడా మార్చేయవచ్చు. అవుట్ డోర్స్‌లో అలాగే బాల్కనీలను ఇది మంచి ఆకర్షణీయంగా మార్చుతుంది. మీరు ఫ్లవర్ పాట్‌కు మూత పెట్టేసి దానిపైన స్నాక్స్ అలాగే టీ పెట్టవచ్చు. బాల్కనీలో అలాగే అవుట్ డోర్లో ఈ సింపుల్ ఐడియాతో మంచి కంఫర్ట్ పొందవచ్చు.
- ఖాళీ ఫ్లవర్ పాట్తో క్రిస్మస్ ట్రీను కూడా తయారుచేసేయవచ్చు. సింపుల్‌గా వివిధ సైజులు గల ఖాళీ ఫ్లవర్ పాట్స్‌ను బోర్లించి ఒక దానిపై ఒకటి పెద్ద సైజు నుంచి చిన్న సైజు దాకా అమర్చాలి. ట్రీ షేప్‌లోకి వచ్చిన ఈ పాట్‌ను మీకు నచ్చినట్టుగా అలంకరించుకోవాలి. ఇక మీ క్రియేటివిటీనంతా ప్రదర్శించే టైం వచ్చేసినట్టే.
- మీ గార్డెన్‌కు గ్రేట్ లుక్ అందించేందుకు ఖాళీ ఫ్లవర్ పాట్స్‌తో హ్యాపీగా లైట్ హౌస్‌ను ప్రిపేర్ చేయండి. గార్డెన్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఒకదానిపై ఒక ఫ్లవర్ పాటును సైజులను బట్టి పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు బోర్లించి వాటిపైన సోలార్ లైట్‌ను ఫిక్స్ చేయవచ్చు.
- చిన్న చిన్న ప్లాస్టిక్ ఫ్లవర్ పాట్స్లలో ఫెర్టిలైజర్స్ వేసి గార్డెన్లో చల్లేందుకు వాడవచ్చు.
ఫ్లవర్ పాట్ కాస్త పెద్దదైతే మీరు దాన్ని మీ పిల్లలను సర్ప్రైజ్ చేసేందుకు ఫెయిరీ హౌస్‌గా మార్చవచ్చు. స్టోన్స్‌తో డిజైన్ చేయవచ్చు. అవకాశం ఉంటే మరింత ఆకర్షణీయంగా డెకరేట్ చేయవచ్చు.
- ఖాళీ ఫ్లవర్ పాట్తో వాటర్ ఫౌంటెయిన్‌ని కూడా తయారుచేయవచ్చు. అపార్ట్మెంట్ బాల్కనీ లేదా గార్డెన్లో ఇది మంచి అందాన్ని తెచ్చిపెడుతుంది.
- ఖాళీ క్లే పాట్స్‌ను ఏం చేయాలో తెలియక వాటితో మంచి క్రాఫ్ట్‌ను తయారుచేయాలనుకుంటే క్లే పాట్ ఫ్యామిలీను తయారుచేయవచ్చు. పిల్లల్ని కూడా ఈ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేస్తే వారికి కూడా ఎంతో సరదాగా ఉంటుంది.
- ఇలా ఖాళీ ఫ్లవర్ పాట్స్‌తో క్రియేటివిటీను వెలికితీసి చుట్టూ ఉన్నవారిని సర్ప్రైజ్ చేయవచ్చు. ఇలా క్రియేటివిటీని ఉపయోగించి ఇంటిని కూడా చక్కగా అలంకరించుకోవచ్చు, టైం సేవింగ్ అలాగే స్పేస్ సేవింగ్ వంటి ఐడియాస్తో బహు ప్రయోజనాలు పొందవచ్చు. మీరేమంటారు...?