Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూడు రోజులుగా ఎండలు బాగా మండిపోతున్నాయి. ఏప్రిల్‌లోనూ ఇలాగే ఉంటుందని వాతావరణ అధికారులు చెప్పేశారు. కాబట్టి మనం వీటికి సిద్ధం కావల్సిందే. పగటి వేళ వేడికి తోడు... రాత్రివేళ ఉక్కపోత చంపుతోంది. ఏసీలు ఆన్ చేస్తున్నా... రూమ్, గోడలు, ఫ్లోర్ చల్లబడటానికి రెండు గంటలు పడుతోందని చాలా మంది చెబుతున్నారు. ఈ వేడికి తెలుగు రాష్ట్రాల్లో 1.37 కోట్ల మందికి రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదు. చాలా మంది పగటి సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు.
- రాత్రివేళ పడుకునేటప్పుడు మరీ ఎక్కువ నీరు తాగకండి. ఎక్కువ తాగితే నిద్రపోయిన 4 గంటల్లో బ్లాడర్ నిండిపోయి మెలకువ వచ్చేస్తుంది. పావు లీటర్ కంటే తక్కువ తాగడం మంచిది. అప్పుడు 6 గంటల తర్వాతే మెలకువ రావచ్చు.
- పడుకునే 2 గంటల ముందే పడకపై ఉన్న దుప్పట్లను బయట ఆరబెట్టండి. తద్వారా బయటి గాలి వాటిని చేరి అవి వేడి లేకుండా ఉంటాయి. పడుకునే ముందు వాటిని బెడ్‌పై వెయ్యిండి. వాటిపై పడుకుంటే త్వరగా నిద్ర పట్టగలదు.
- సాయంత్రం సూర్యుడు వెళ్లిపోయాక తడి గుడ్డతో ఇల్లంతా తుడిచేయండి. దాంతో నేలలో వేడి కొంతైనా తగ్గుతుంది. తుడిచాక ఫ్యాన్ లేదా ఏసీ వెయ్యండి. దాంతో రూంలో చల్లదనం వస్తుంది. పిల్లలు ఉన్న ఇంట్లో ఇలా చెయ్యడం ద్వారా పిల్లల ఆరోగ్యం కాపాడినట్లవుతుంది.
- మొక్కలు విపరీతంగా పెంచండి. ఇంటి బయట చెట్లు, ఇంటిలోపల నీడలో పెరిగే మొక్కల్ని పెంచుకోవాలి. బయట ఉండే చెట్లు ఇంటిపై ఎండ ఎక్కువ పడకుండా చేసి ఇంటికి చల్లదనం ఇస్తాయి. లోపల ఉన్న మొక్కలు లోపలి వేడిని పీల్చుకొని ఉక్కపోత లేకుండా చేస్తాయి.
- పడుకునే 2 గంటల ముందే ఏసీ ఆన్ చేసుకోండి. పడుకునే సమయానికి బెడ్ రూం చల్లబడుతుంది. అప్పుడు ఏసీ మరీ ఎక్కువ చల్లదనంతో ఉంచకపోయినా ఆల్రెడీ ఉన్న కూలింగ్ కంటిన్యూ అవుతుంది. దాంతో నిద్ర బాగా పడుతుంది.
- పడుకునే సమయంలో మొబైల్‌ను దూరంగా ఉంచండి. రోజూ టైమ్ ప్రకారం పడుకోవడం అలవాటు చేసుకోండి. ఉదయం వేళ ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకి హాయిని ఇస్తుంది. - అందువల్ల రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా లేచే అలవాటు మంచిదే.
- కొంతమందికి ఏ పుస్తకమో చదివితే తప్ప నిద్రరాదు. అలాంటి అలవాటు ఉంటే మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే పుస్తకాలు చదవడం మేలు.
- పడుకునే సమయంలో బెడ్ లైట్ ఉండొచ్చు. ఎక్కువ కాంతి లేకపోతే నిద్ర బాగా పడుతుంది. - పూర్తిగా లైట్ లేకుండా పడుకోవడం ఇంకా మంచిది. లైట్ ఉంటే దాని నుంచి కూడా వేడి వస్తుంది. నిద్రపోయే చోట రెడీగా వాటర్ ఉంచుకోండి. సడెన్‌గా మెలకువ వస్తే వాటర్ తాగి పడుకోండి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఎండాకాలాన్ని గట్టెక్కించుకుంటే ఆ తర్వాత వానాకాలం, శీతాకాలం చక్కగానే నిద్రపోవచ్చు.