Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంట్లోని సూక్ష్మక్రిములు నశించాలంటే.. కిటీకీలను తెరిచివుంచండి. ఇంట్లో క్రిమికీటకాల బెడద లేకుండా ఉండాలంటే.. కిటికీలు, తలుపులు తెరిస్తే సూర్యకిరణాలు లోపలకువస్తాయి. తాజా గాలి, సూర్యరశ్మి వల్ల ఇంట్లో క్రిములు నశిస్తాయి. బేకింగ్ సోడాకు ఇంట్లో వచ్చే అసౌకర్యంగా ఉండే వాసనల్ని పీల్చే శక్తి ఉంటుంది.
కార్పెట్ల వంటి మీద రాత్రి బేకింగ్ సోడా చల్లి, ఉదయాన్నే దులిపివేస్తే కార్పెట్లు తాజాగా ఉంటాయి. క్రిములు నశింపజేయడంలో వేపనూనె తిరుగులేనిది. ఓ కప్పు నీటిలో ఒక స్పూన్ వేప నూనె కలిపి కిచెన్‌లో, బాత్రూమ్లో జల్లితే క్రిములు తొలగిపోతాయి. లావెండర్ ఆయిల్‌కు క్రిముల్ని నశింపజేసే శక్తి ఉంటుంది. కాబట్టి కప్పు నీటిలో కొన్ని చుక్కలు లావెండర్ ఆయిల్ కలిపి స్ప్రే చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది.
స్పాంజ్లు, డిష్ క్లాత్స్, టూత్ బ్రష్‌లు, వాష్ క్లాత్స్ వంటివాటిని బాగా ఆరనిస్తుంటే క్రిములు ఉండవు. తలుపుల గడులు, స్టవ్ నాబ్స్, టెలిఫోన్, కబ్ బోర్డ్, ఫ్రిజ్ హ్యాండిల్స్, పిల్లల బొమ్మలు, కటింగ్ బోర్డులు, డ్రెయిన్లు వంటివి క్రిములకు నిలయం వంటివి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రపరుచుకుంటూ వుండాలి.