Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్రలేచింది మొదలు... ఉరుకులు పరుగుల జీవితం మహిళలది. త్వరగా అలసిపోవడం, నీరసంగా అనిపించడం ప్రతి మహిళలను నేడు వేధిస్తున్న సమస్య. దీనికి కావాల్సిందల్లా ఐరన్. శరీరానికి తగిన ఐరన్‌ను ఆహారం ద్వారా అందించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అందుకే తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఐరన్ శరీరానికి ఖనిజాలను అందిస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.
ఐరన్ లోపం వల్ల లావు తగ్గడం, తరచూ తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి.
ఐరన్ లభించే పదార్థాలు ఉడికించిన గుడ్డు, చేపలు, బీన్స్, ఆకుకూరలు, పచ్చని కూరలు, డ్రైఫ్రూట్స్, సోయా, మాంసం, రాగులు...
ఐరన్ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. శరీరానికి ఆక్సిజన్ అందించే ఎర్ర రక్తకణాల సంఖ్య పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదు.
బిడ్డ నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపే ఐరన్‌ను గర్భిణులు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది.
నెలసరి సమస్యలు ఎదుర్కొనేవారు, బాలింతలు తప్పక ఐరన్ తీసుకోవాలి.