Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియ ఈ మధ్యనే కొత్తగా జాబ్లో చేరింది. గత అనుభవం లేకపోవడంతో తోటి వారితో ఎలా ఉండాలి? పని ఎలా చేయాలి? పనిలో ఏదైనా సందేహం వస్తే ఎలా? పని సరిగా చేయలేకపోతే బాస్ పనిలో నుండి తీసేస్తారేమో.. అని ఇలా సవాలక్ష ప్రశ్నలు ప్రియ బుర్ర నిండా తిరుగుతున్నాయి. ఇలాంటి సమస్య ఒక్క ప్రియకే కాదు చదువు, కాలేజీ, ఇల్లు తప్ప వేరే ప్రపంచం లేకుండా గడిపిన వారికి సర్వసాధారణం. అందుకే నలుగురితో కలిసిపోయే మనస్తత్వాన్ని మొదటి నుండే అలవర్చుకోవాలి. అయితే ఇప్పటి వరకు మీరు అలాంటి వాతారణంలో పెరగలేదా! మరి ఈ చిన్ని చిన్ని చిట్కాలు పాటించండి. ఎక్కడకు వెళ్ళినా నెగ్గుకు రాగలరు.
ఆఫీసు వాతావరణంలో త్వరగా ఇమిడిపోయే తత్వం ఉద్యోగికి ఉండాలి. కొత్త విషయాన్ని నేర్చుకునే తత్వంతో పాటు ఆఫీసులో ఇతరులతో చక్కగా మెలిగే స్వభావం ఉండాలి. తోటివారికంటే వేగంగా పని చేస్తూనే... కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీ కెరీర్ గ్రాఫ్ సజావుగా సాగుతుంది.
ఉద్యోగి తనకిచ్చిన లక్ష్యాలను అందుకోవాలంటే అందరిలో కంటే డిఫరెంట్గా ఆలోచించే నైపుణ్యం ఉండాలి. సంస్థలో పని భారాన్ని ఎక్కువగా తీసుకున్నపుడు మంచి పేరు వస్తుంది. అనుకున్న లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి. అప్పుడే సంస్థలో గుర్తింపు వస్తుంది.
ఉద్యోగం సంపాదించాలంటే చాలా కాంపిటీషన్ను దాటుకుని రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత కెరీర్ను ఎలా బిల్డప్ చేసుకోవాలి? త్వరగా సంస్థలో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు ఈ విషయాలు తెలుసుకోవాలి.
ఉద్యోగం తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలో ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి అంతే కష్టపడాలి. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అప్పడే పోటీ ప్రపంచంలో మనుగడ సాధ్యం అవుతుంది. కొలువు కుదిరిన చోట మంచి మార్కులు రావాలంటే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. నేర్చుకున్నదాన్ని ఉద్యోగంలో ఎలా అప్లై చేయాలనే విషయం తెలిసుండాలి. వీలైతే సీనియర్స్ సహాయంతో పనిలోని మెలకువలు తెలుసుకోవాలి. ు