Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్షాకాలం వచ్చేసింది. వర్షంలో బయటకు వెళ్ళాలంటే మాములుగా రెయిన్ కోటు లేదా గొడుగు తీసుకెళ్ళడం మాములే. కానీ మారిన ఫ్యాషన్ ట్రెండ్‌కు అనుగుణంగా ఈ మురిసే ముసురువానకు స్పెషల్ డ్రెస్‌లు.. ఫుట్‌వేర్.. గ్యాడ్జెట్స్.. బ్యాగ్స్.. యాక్సెసరీస్.. గొడుగు గుభాళిస్తూ మార్కెట్లోకి వచ్చేశారు. ఈ వర్షం సాక్షిగా మీ ఆరోగ్యానికి రక్షణగా ఉండేలా ఈ ఫ్యాషన్ దుస్తులు, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయి.
వానలో తడవకుండా ఉండేందుకు వెరైటీ గొడుగులు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. అనేక రంగుల్లోనే కాదు వివిధ ఆకారాల్లో గొడుగులు అందుబాటులో ఉన్నాయి. కేవలం గొడుగులే కాదు రెయిన్ కోట్లు కూడా రకరకాల రంగుల్లో, డిజైన్లలో ట్రెండ్‌కి తగ్గట్టు మారుతూ సరికొత్త ఫ్యాషన్లను అద్దుకుని మార్కెట్లో దర్శనమిస్తూ.. మనసు దోచుకుంటున్నాయి. ఆఫీసులకు, స్కూలుకెళ్లే పిల్లల వరకూ అందరికీ సరిపోయే సైజులో రెయిన్కోట్లు మార్కెట్లో అమ్ముతున్నారు. తలపై నుంచి టోపీలా వచ్చే రెయిన్ కోట్ అయితే జుట్టు కూడా తడవకుండా ఉంటుంది.
సమ్మర్లో అలవాటైన కాటన్ డ్రెస్సులు కంఫర్ట్‌గా ఉంటాయి. కానీ వర్షాకాలంలో కాటన్ దుస్తులు వేస్తే బాగుండదు. కాటన్ దుస్తులయితే వర్షంలో తడిసి శరీరానికి అంటుకుపోతాయి. దానివల్ల రాషెస్ వచ్చి చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అనుకోని అతిథిలా వచ్చే వర్షంలో తడిసినా వెంటనే ఆరిపోయేలా సింథటిక్, ఫ్యాబ్రిక్ దుస్తులు ధరించాలి.
షార్ట్స్కర్ట్స్, చూడీదార్ లాంటివి ధరిస్తే కంఫర్ట్‌గా ఉంటుంది. జీన్స్, లెగ్గింగ్స్ అయితే బెటర్.
శరీరమంతా తడవకుండా కాపాడుకున్నా పాదాలు మాత్రం కచ్చితంగా వర్షపు నీటిలో తడుస్తుంటాయి. పాదాలు తడవకుండా కాపాడుకునేందుకు మాన్సూన్ స్పెషల్ ఫుట్‌వేర్ వాడాలి. మార్కెట్లో సింథటిక్‌తో తయారుచేసిన షఉస్, ఫుట్‌వేర్ బోలెడు అందుబాటులో ఉన్నాయి. మోకాళ్ల వరకూ ఉండే లాంగ్బూట్స్ అయితే ఇంకా బెటర్. రబ్బర్ ఫుట్‌వేర్, ప్లాస్టిక్ సాండల్స్ అయితే కంఫర్ట్‌తో పాటూ నానినా, కడిగినా ఏం కావు. వర్షాకాలంలో వెంట్రుకలు గాలికి పైకి లేవకుండా కుదురుగా ఉండడానికి మాన్సూన్ హెయిర్బ్యాండ్లు కూడా దొరుకుతున్నాయి.
మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్ లాంటి గాడ్జెట్స్ వాననీటిలో తడవకుండా ఉండేలా డబుల్ లేయర్డ్ థర్మాపాలిస్టిక్ స్కిన్ కవర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్కూల్‌కు వెళ్ళేవారి కోసం, ఆఫీస్‌కి ట్యాబ్ తీసుకెళ్లే వారికోసం స్పెషల్ వాటర్‌ప్రూఫ్ బ్యాగులు కూడా అందుబాటులో ఉన్నాయి. కాలానికి తగ్గట్టుగా స్పెషల్ స్పెషల్ యాక్సెసరీస్ కూడా మాన్సూన్ స్పెషల్‌గా మార్కెట్లో ఉన్నాయి. బీట్స్, ప్లాస్టిక్ యాక్సెసరీస్, వాటర్‌ప్రూఫ్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
వర్షంలో తడవాలంటే ఆనందమే.. కానీ, ఎక్కువగా తడిస్తే.. అనారోగ్య సమస్యలు వస్తాయి. స్కూల్, ఆఫీస్‌లకు వెళ్ళేవారే కాకుండా వర్షాకాలంలో బయటకు వెళ్ళేవారంతా తప్పనిసరిగా మార్కెట్లో దొరికే మాన్సూన్ స్పెషల్ దుస్తులను ధరిస్తే.. మంచిది.