Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈకాలంలో పిల్లలకు రెండున్నరేళ్ళు నిండగానే స్కూల్లో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. దాంతో చిన్నతనం నుంచే చదువుల వేట మొదలైపోతుంది. కాని ఈ వయసు పిల్లలతో అప్పటినుంచే కష్టాలు ప్రారంభమైతున్నాయి తల్లిదండ్రులకు. ఇంట్లో బతిమిలాడి నోట్లో పెడితే కాని తినని పిల్లలు స్కూలుకి వెళ్లిన తర్వాత పంపించిన బాక్స్ అలాగే వెనక్కు వచ్చేస్తుంది. దాంతో పిల్లల్లో పోషకాహార లోపం, అనారోగ్య సమస్యలు. కాబట్టి పిల్లలకు ఇంట్లోనే పోషకాలతో కూడిన ఆహారాన్ని ఓపిగ్గా పెట్టాలి.
పిల్లలు పెట్టిన వెంటనే తినడానికి ఇష్టపడరు. ఇలా తినడానికి మారాం చేస్తుంటే మా పిల్లలు తినరు అని చెప్పి వదిలేయకండి. భయపెట్టో, బతిమాలో వారికి తినిపించాల్సిన బాధ్యత మీదే. పిల్లలు పెద్దవాళ్లలాగా ఒకేసారి ఎక్కువ మోతాదులో భోజనం చేయలేరు. తిన్న కొద్ది భోజనంతోనే ఒక పూటంతా ఉండలేరు. కాబట్టి వారికి రోజులో ఐదు నుండి ఆరుసార్లు కొంచెం కొంచెంగా తినిపించాలి. ఎప్పుడు ఆకలి అన్నా ఏదో ఒకటి పెడుతూ ఉండాలి. తినే ఆసక్తి చూపించకపోతే ఆహారాన్ని రకరకాల ఆకారాలలోకి
మార్చి పెట్టాలి. ఉదాహరణకు ఇడ్లీని సమాంతరంగా కట్ చేసి 'చూశావా ఇది ట్రైన్‌లా ఉంది...' అని నోట్లో పెట్టేస్తూ ఉండాలి. ఒకవేళ వారు చేతులతో తినడానికి ఇష్టపడితే అలాగే తిననివ్వండి. కింద పారబోస్తారు అని మీరే పెట్టడానికి ప్రయత్నించొద్దు. వాళ్ళు తింటున్నప్పుడు మీరు కూడా వేరే పళ్లెంలో పెట్టుకుని తినండి. 'పెట్టింది తినేస్తే నీకు మంచి బహుమతి ఇస్తా...' ఇలాంటి కబుర్లు చెపుతూ తినిపించేయండి. ఇలాంటి చిన్నచిన్న ట్రిక్కులు పిల్లల దగ్గర తప్పవు మరి. ప