Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటికి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్ కావాలనే అనుకుంటున్నారు. రిస్క్ లేకుండా ఆఫీస్లో కూర్చొని చేసే ఉద్యోగాలకే ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రత్యేక కోర్సుల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఇరవై సంవత్సరాల క్రితం నేను ప్రారంభించినపుడే చాలామంది నీకెందుకు ఈ విమానాల గోల అనేవారు. ఇప్పటికీ పరిస్థితి అలాగే వుంది. నిజానికి అమ్మాయిలకు ఇది చాలా అనుకూలమైన ఉద్యోగం. మూడు గంటలు పని చేస్తేచాలు. ఇంటికోసం, తమ కోసం కావల్సినంత సమయం దొరుకుతుంది. ఆదాయం కూడా బాగుంటుంది. పైగా ఇది ప్రత్యేక గుర్తింపు వున్న వృత్తి.