Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నెన్నో మాయలు చేసినవాళ్ళు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా... మంచి మనిషిగా బతకడమే కష్టమైన విషయంఃః అంటారు సూఫీ కవి కబీర్. నిజంగా మంచి మనిషిగా బతకడం కన్నా ఉదాత్తమైన ఆశయం ఏమీ లేదు. మంచిగా బతకడమంటే చెడు మీద తిరుగులేని పోరాటం చేయడం, దుర్మార్గాన్ని ప్రతిఘటించడం, తప్పుని తప్పు అని ధైర్యంగా చెప్పగలగడం, అభిప్రాయాల కోసం కలబడడం. గొప్ప ఆశయాలని వల్లిస్తూ అందుకు విరుద్ధంగా