Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టమాటాలో విటమిన్ సి, విటమిన్ కె లు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, ఫోలెట్, పొటాషియంతోపాటు ఇతర న్యూట్రియెట్స్ కూడా ఉన్నాయి. ఒక మీడియం టమోటా 22కిలో కేలరీలతో సమానంగా ఉంటుంది. ఇందులో జీరో శాతం కొవ్వు, 5 గ్రాముల కార్బోహైడ్రేట్, 1 గ్రాము ఫైబర్, 1గ్రాము ప్రొటీిన్, 5గ్రాముల సోడియం ఉంటుంది. ఆల్ఫాబీటా కెరోటిన్, ల్యూటిన్ మరియు లైకోపీన్ వంటి ప్రధాన కేరోటినాయిడ్లన్నింటినీ కలిగి ఉన్న టమాటా మీ చర్మం, ముఖం, జుట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది.
టమాటాలు మీ ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్‌ను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో టమాటా ముక్కతో మర్దన చేయండి.
టమాటాల్లో ఉన్న లైకోపిన్ అత్యుత్తమ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీని కలిగి ఉంది. ఇది సహజ రక్తస్రావ నివారిణిగా సహాయపడుతుంది. లైకోపీన్ యొక్క అధిక కంటెంట్ తో ఆహారాన్ని ఉపయోగించడం ద్వారా టమోటాలు చర్మానికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
ఎండలో తిరగడం వల్ల ముఖానికి మురికి పట్టడం సహజం.దీంతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యకు టమాటాతో చెక్ పెట్టొచ్చు. టబాటా గుజ్జును మీ ముఖంపై అప్లై చేసి,15నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగండి. మీ స్కిన్ టోన్ రిపేర్ చేయడంతో పాటు రిఫ్రెష్ చేస్తుంది.
మొటిమలను తొలగించడంలో టమాటాలు కీలకపాత్ర పోషిస్తాయి. మిటమిన్ ఏ, సి, కె మరియు ఆమ్లధర్మాల లక్షణాలు మీ ముఖంపై ఉన్న మొటిమలను తొలగించడంలో సహాయపడుతాయి. ముఖంపై టమాటా గుజ్జును అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. ఫలితం మీరే చూస్తారు.
టమాటాలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో టమాటాలను చేర్చడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. టమాటాల్లో కేలరీలు తక్కువగా ఉండటంతోపాటు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉన్నందున బ్యాడ్ కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేస్తుంది.