Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరికి బస్సు, మరికొందరికీ కారులో ప్రయాణం చేయాలంటే భయం.. ఎందుకంటే బస్సు, కారు ఎక్కగానే వాంతి వస్తున్న ఫీలింగ్.. కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది. దీనిని మోషన్ సిక్నెస్, ట్రావెల్ సిక్నెస్ అంటారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ప్రయాణమంతా విసుగు వికారాలతో చేయాల్సి వస్తుంది. అందుకే దూర ప్రయాణం అంటేనే అయిష్టత ప్రదర్శిస్తారు. నేను రాను అనేస్తారు. ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ వాంతి సమస్యని సమర్ధంగా ఎదుర్కొవచ్చు అంటున్నారు వైద్యులు.
ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని, నమలకుండా.. బుగ్గన ఉంచుకుంటే వాంతి రాదట. ఎందుకంటే.. అల్లంలో ఉండే కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి మనకు అవసరమైన పోషకాలను అందించి వాంతి వచ్చే ఫీలింగ్‌ను తగ్గిస్తాయి.
ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు, బస్సు మలుపులు, కుదుపుల సమయంలో చాలామందిలో ఈ సమస్య కనిపిస్తుంది. అలాంటప్పుడు నిమ్మకాయ వాసనని పీలిస్తే చాలావరకు వాంతి రాదు.
లవంగాలు, సోంపు వంటివి చప్పరించినా, నములుతూ ఉన్నా కూడా వాంతులు రావు.
నిజానికి ఈ వాంతి సమస్య ఎక్కువగా సైకలాజికల్ ఫీలింగే. ప్రయణం చేసే సమయంలో చుట్టూ కనిపించే ప్రకృతిని, పరిసరాలను గమనిస్తూ.. టూర్‌ను ఆస్వాదించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.