Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జంక్ ఫుడ్ అంటే మనందరికీ ఇష్టమే. పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే పిల్లలకు కూడా పెద్దలు తినే జంక్ ఫుడ్స్‌నే ఇస్తుంటారు. అయితే ఇలా చిన్న పిల్లలు హైవాల్యూ జంక్ ఫుడ్ తినడం వల్ల 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 5ఏండ్ల నుండి 17ఏండ్లలోపు ఊబకాయం బారిన పడే పిల్లల సంఖ్య 268 మిలియన్లు ఉంటుందని పరిశోధనల ద్వారా అంచనా వేస్తున్నారు.
ఓబెసీటీ బారిన పడే పిల్లలు 2010లో 76మిలియన్లు ఉంటే 2025నాటికి 91 ఉంటారని పీడియాట్రిక్ ఓబేసీటీ జనరల్ వారు తమ పరిశోధనల్లో వెల్లడి చేశారు. అలాగే 2025 నాటి 12 మిలియన్ల పిల్లల్లో గ్లూకోజ్ టాలరెన్స్ కూడా ఉంటుందని, 4 మిలియన్ల పిల్లలు టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతారని, 27మిలియన్ల పిల్లల్లో హైపర్ టెన్షన్, 38 మిలియన్ల పిల్లల్లో లివర్‌లో ఫ్యాట్ పెరుగుతుందని ఓ అంచనా ప్రకారం వివరించారు. ఇలా పిల్లలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీస్ చాలా తక్కువగా ఉండటం వల్ల చిన్న వయసులోనే ఊబకాయులుగా మారుతున్నారు. కాబట్టి, చిన్న వయసులోనే పిల్లల జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా పెట్టాలి: పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడానికి అలవాటు చేయాలి. అత్యధిక న్యూట్రీషియన్స్‌ను అందించే కూరగాయలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోమని ప్రోత్సహించాలి.
న్యూట్రీషియన్పై అవగాహన: పిల్లలకు న్యూట్రీషియన్పై అవగాహన కల్పించడంవల్ల వారికి యంగ్ ఏజ్ లో ఆహారాల మీద అవగాహన పెరగడంతో పాటు ఆరోగ్యపరమైనవి ఎంపిక చేసుకోవడానికి, జీవనశైలి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది
జంక్ ఫుడ్స్‌కు దూరంగా పెట్టాలి: జంక్ ఫుడ్ కావాలని పిల్లలు మారాం చేస్తుంటే వాటిగురించి కలిగే హాని వివరించి, హోం మేడ్ స్నాక్స్ , మీల్స్‌ను అలవాటు చేయాలి. స్కూల్‌కి కూడా అవే ఇచ్చి పంపాలి. ప్యాకేజ్, ఇన్స్టెంట్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి. సమయాన్ని బట్టి వారికి మంచి ఆహారం అందివ్వాలి.
ఆహారపు అలవాట్లలో మార్పులు: అధిక బరువున్న పిల్లలు బరువు తగ్గడానికి సహాయపడాలి. ఇంటిల్లి పాది ఎలాంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటారో వారికి నేర్పించాలి. పెద్దలతో పాటు, పిల్లలకు ఒకే విధమైన ఆహారాన్ని అందివ్వడం వల్ల అందరూ ఒకే రకమైఆరోగ్యాన్ని కలిగి ఉంటారు.
భోజనం చేసే సమయంలో టీవీ ఆఫ్ చేయాలి: టీవీ చూస్తూ భోజనం చేయకుండా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా ఎక్కువ ఆహారాలను తీసుకుంటారు. దాని వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతున్నారు.
ఫిజికల్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించాలి: చదవుతూ, వీడియో గేమ్స్‌తో కాలం గడపకుండా పిల్లలో ఫిజికల్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించాలి. ఆడుకోవడానికి బయటకు తీసుకెళ్ళాలి. ఇవి వారిలో క్యాలరీలను బర్న్ చేస్తాయి. ఆకలి పెంచి హెల్తీ ఫుడ్స్‌ను తినడానికి ప్రోత్సహిస్తాయి.
కిచెన్‌లో వారిని కూడా ఇన్ వాల్వ్ చేయాలి: వంటచేసే సమయంలో పిల్లలను కూడా ఇన్ వాల్వ్ చేయాలి. ఇలా పిల్లలతో కలిసి చేయడం వల్ల వారి ఆహారాల గురించి, వాటిలోని పోషక విలువల గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
గెట్ టు గెదర్తో: కుటుంబ సభ్యులు అందరూ అప్పుడప్పుడు కలవడం, హెల్తీగా వంటలు చేసుకోవడం, పిల్లలకు నేర్పడం, మంచి ఆహారాలను అందివ్వడం వల్ల పిల్లల్లో మంచి అభిప్రాయం, అభిరుచులు, అలవాట్లు ఏర్పడతాయి.