Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగం చేసే మహిళల్లో 40 శాతం మంది పనుల విషయంలో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారట. ఎందుకంటే ఏ రోజూ పనికీ ఆ రోజే ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం, రేపటి పనులకు సరైన ప్రణాళికలు లేకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలా చేయటం వల్ల పనిలో నైపుణ్యత లోపించటంతో పాటు సోమరి తనం వస్తుంది. కాబట్టి ఈ రోజూ పని పూర్తికాగానే రేపటి పనులను నోట్ చేసుకోవటం కీలకం. ఇలా చేయటం వల్ల ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. అలాగే పనిలో మంచి ఫలితాలను చూస్తారు.
రేపు చేయబోయే పనులను ఒక పేపరు పై రాసుకోవాలి. ఇలా రాసుకోవటానికి కేవలం పది నిమిషాల సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మర్నాడు చేసే పనిలో మంచి ఫలితం కనిపిస్తుంది. పనులన్నీ వేగవంతంగా, నెమ్మదిగా పూర్తి చేసుకుంటారు. ఇలా రాసుకోవటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితాన్ని చూస్తారని చెబుతున్నారు పరిశోధకులు.
కొంత మంది రేపటి పనులను తలుచుకొని మానసికంగా, శారీరకంగా కుంగీపోతారు. ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే కొంచెం ఆలోచించి రేపటి పనులకు ముందుగా షెడ్యుల్ సిద్ధం చేసుకుంటే సరిపోతుంది. దీని వల్ల పని చేసే సమయంలో మూడ్ మారకుండా ఉంటుంది. కచ్చితంగా ఒక పది నిమిషాలు సమయం కేటాయించి ఇన్‌బాక్స్‌లో ఉన్న పాత విషయాలను క్లిన్ చేసుకుంటే కొత్త విషయాలను నింపుకుంటారు. ఆఫీసు పనులు పూర్తికాగానే ఈ రోజూ ఏం పనులు చేశారో ఒక్కసారి గుర్తుచేసుకోండి. అలాగే మర్నాడు చేయబోయే పనులను చిన్న కాగితం ముక్కపై రాసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సులభమైన మంచి పద్ధతి.