Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్రపట్టకపోవడానికి కారణాలు అనేకం. మరి వాటినుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే.. ఒత్తిడి నిద్రలేమికి కారణం. ఒత్తిడి కూడా నిద్రను ఆటంకపరుస్తుంది. కాబట్టి దాన్ని కూడా వీలైనంతవరకూ తగ్గించుకోవడం మంచిది. రోజూ నడవడం, జాగింగ్ చేయడం, పార్కులో గడపడం, నచ్చిన పనిలో ఓ పదినిమిషాలు నిమగం కావడం వంటి పనులు కూడా ఒత్తిడిని అదుపు చేస్తాయి.
ప్రతిరోజూ ఓ ఇరవై నిమిషాలపాటు ఎండ మీపై పడేలా చూసుకోండి. ఈ కిరణాలు మీ శరీరంపై పడటం వల్ల మెలటోనిన్ అనే హార్మోను ఉత్పత్తి బాగా జరుగుతుంది. ఈ హార్మోను రాత్రిపూట విడుదలై హాయిగా నిద్రపట్టేందుకు ఉపయోగపడుతుంది.
మీ పడకగదిలో వెలుతురు వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే టీవీ, ఫోను, ట్యాబ్, కంప్యూటరు లాంటివాటిని రెండుగంటల ముందు కట్టేయండి. బదులుగా మంచి సంగీతం వినడం లేదా ఓ పుస్తకం చదవడం అలవాటుగా మార్చుకోండి.
+ మెగ్నిషియం కండరాలు, మెదడుకీ సాంత్వన అందిస్తుంది. కాబట్టి ఈ ఖనిజం లభించే ఆహార పదార్థాలను మీ భోజనంలో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా బాదం, జీడిపప్పూ, గుమ్మడి గింజలూ, ఆకుకూరలూ, అరటిపండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది.