Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లలు ఎలా ఉన్నారు... ఏం చేస్తున్నారు... ఎలా ఉంటున్నారు... ఎలా మాట్లాడుతున్నారు... అని పిల్లల వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుకుంటుంటారు చాలా మంది తల్లిదండ్రులు. కానీ ఇంట్లో పిల్లల ముందు వారు ఎలా ప్రవర్తిస్తున్నారో ఓ సారి నెమరు వేసుకుంటే మంచిదని చెబుతున్నారు అధ్యయనకర్తలు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో ఎలా మాట్లాడాలి ! ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం కీలకం. మీ అలవాట్లను బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులకు కోపం ఎక్కువగా ఉంటుంది. అది పనుల ఒత్తిడి వల్ల ఆరోగ్య కారణాల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా అనేక విషయాలు కోపానికి దగ్గర చేస్తాయి.
కోపం అనేది అందరికీ వచ్చేదే.. ఎవరికీ నచ్చదు. దీని వల్ల ఎన్నో అనార్థలుంటాయి... కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారో.. ఏలా ఉంటున్నారో తెలియదు. ముఖ్యంగా తల్లిదండ్రులకు కోపం వస్తే పిల్లలను వెంటనే కొట్టేస్తారు. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. ఈ ప్రభావం పిల్లల మీద చాలా ఎక్కువగా పడుతుంది. దాంతో చికాకు పడటం, చెడు పదాలను ఉపయోగించడం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడటం వంటివి చేస్తారు. ఈ లక్షణాలు చిన్న వయసులో కనిపించక పోయినా పెద్దయ్యాక బయట పడతాయి. కాబట్టి బీ కేర్ ఫుల్ ! ప