Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మాయిలను చేయిపట్టి లాగి అల్లరి చేసేవారు కొందరైతే.. చున్నీలు, చీరకొంగులు పట్టిలాగి వేధించేవారు మరికొందరు. ఎక్కువగా కాలేజీల్లో.. రోడ్డుపై ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. పొరపాటున చున్నీ గొంతుకు బిగ్గరగా బిగుసుకుంటే క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఇలాంటి దారుణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఊపిరి ఆడకుండా చేసే ఇలాంటి సంఘటనల్లో పాటించాల్సిన టెక్నిక్స్ ఈ వారం మనం నేర్చుకుందాం..!
నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిని వెనుక నుంచి వచ్చిన వ్యక్తి చున్నీ పట్టిలాగాడు. ఆమె గొంతుకు చున్నీ బిగుసుకు పోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. చాలామంది ఈ లాంటి సందర్భంలో చున్నీ పట్టి లాగుతూ.. గొంతుకు బిగుసుకుపోకుండా పెనుగులాడుతారు.
చున్నీ గొంతుకు బిగుసుకుంటుంటే మీరు వెంటనే అప్రమత్తం కావాలి. చున్నీ ని పట్టి లాగే ప్రయత్నం చేయకుండా వెనక్కి తిరగాలి. దాంతో మీ గొంతు వద్ద బిగుసుకున్న చున్నీ మీ మెడ మీదకు వస్తుంది. ఊపిరి తేలిక అవుతుంది.
ఇప్పుడు మీ చున్నీ పట్టి వెనక నుంచి లాగిన వ్యక్తి మీ ముందు ఉంటాడు. మీ ప్రతిచర్య ఆ వ్యక్తికి అర్థం కాకముందే మీ రెండు చేతులతో వాడి జుట్టును గట్టిగా పట్టుకోవాలి. వాడి రెండు చేతులు మీ చున్నీ పట్టుకొని ఉంటాయి కాబట్టి వెంటనే మరో స్టెప్ వేయలేడు.
వెనువెంటనే వాడికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మీ రెండు చేతులతో వాడి జుట్టు పట్టుకుని కిందకు వంచాలి. మీ కుడి మోకాలిని పైకి ఎత్తి వాడి ముఖంపై నీ అటాక్ ఇవ్వాలి. అంతే కండ్ల ముందు చుక్కలు కనిపిస్తాయి. మరోసారి ఎవరీ చున్నీలను తాకలేడు.
అకతాయిల అల్లరికి అడ్డుకట్ట వేయాలంటే ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి. తమను తాము రక్షించుకోగలమన్న నమ్మకం వచ్చినప్పుడు ఆత్మస్ధైర్యం ముందడుగు వేయగలుగుతారు. చిన్నచిన్న టెక్నిక్స్ నేర్చుకుంటే ఎంతటి బలవంతుడినైనా ఎదిరించవచ్చు.
- ఎన్. లక్ష్మీ రవి,
ఇంటర్నెేషనల్ గోల్డ్ మెడలిస్ట్,
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్,
గాంధీనగర్, హైదరాబాద్.
9490239170, 9949039049
- రమేశ్