Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొన్ని అధ్యయనాల ప్రకారం గుప్పెడు బాదం పప్పులు స్నాక్స్ రూపంలో తీసుకుంటే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుతుంది. దాంతో పాటు శక్తి సామర్థ్యం పెరుగుతుంది. చాలా మంది కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి వ్యాయామం చేస్తారు. కానీ ఆహారం విషయంలో ఎలాంటి నియామలు పాటించరు. కొవ్వు అధికంగా ఉండే నూనెలను ఉపయోగించడం, వేపుళ్లు, పిజ్జా, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకుంటారు. మరి కొంత మంది నిపుణుల సలహా మేరకు కొన్ని మందులు వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల కచ్చితమైన అవగాహన తప్పని సరి !
అలాగే ప్రతిరోజూ ఉదయం పూట 20 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు గుండె, శ్వాస సంబంధిత వ్యాధులు దూరం అవుతాయి. అలాగే 48 సంవత్సరాలు ఉన్న వారు కొలెస్ట్రాల్ లెవల్స్ టెస్టు చేయించుకోవడం మంచిది. దాంతో పాటు ప్రతిరోజూ స్నాక్స్ రూపంలో గుప్పెడు బాదం పప్పులను తీసుకుంటే సరిపోతుంది. గుప్పెడు బాదం పప్పుల్లో 43 గ్రాముల క్యాలరీలను కలిగి ఉంటాయి. బాదం పప్పులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు క్యాలరీలను పెంచుతాయి. ఉదయం పూట బాదం పప్పును డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి. బాదం పప్పు తినడానికి ఇష్టపడనీ వారు ఒక గ్లాసు పాలల్లో మెత్తగా గ్రైండ్ చేసిన బాదం పొడిని, రెండు చెంచాల తేనె కలుపుకొని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. రీ