Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందాన్ని రెట్టింపు చేయడంలో ఆముదం నూనె పాత్ర కీలకం. ఇది కురులనే కాదు కనుబొమ్మలు, కను రెప్పలు ఒత్తుగా పెరగడానికి దోహదపడుతుంది. ఆముదం నూనెను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే వెంట్రుకలు పొడవుగా, మృదువుగా పెరుగుతాయి. ఆముదం నూనెకు సంబంధించిన కొన్ని చిట్కాలను గురించి తెలుసుకుందాం...!
జుట్టు ఎక్కువగా చిక్కులు పడి, ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయండి..! ఆముదం నూనెను వెంట్రుకలకు నిండుగా పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే ఆముదంలోఉండే రిసినొలిక్ ఆమ్లం పిహెచ్ లెవల్స్‌ను సమతుల్యంగా ఉంచుతుంది. ఆముదం నూనె సహజ సిద్ధమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
అలాగే ఒక చెంచా ఆముదం నూనెలో, సగం చెంచా కొబ్బరి నూనె, సగం చెంచా ఆలివ్ నూనె కలిపి జుట్టుకు పట్టించి గంట తర్వాత షాంపూ పెట్టి తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.
ఆముదం నూనెలో న్యూట్రీన్లు, ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి వెంట్రుకలు త్వరగా పెరగ డానికి ఉపయోగపడతాయి. అలాగే దీంట్లో ఉండే ప్రోటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, ఫోలిక్ ఆమ్లాలు జుట్టు నల్ల గా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడ తాయి.
కనుబ్మొమలు తక్కువగా ఉన్న వారు గుండ్రంగా, చిన్నగా ఉండే కాటన్ బాల్‌ను ఆముదం నూనెలో ముంచి కనుబొమ్మలకు పట్టించాలి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పట్టించి, మర్నాడు ఉదయం తొలగించుకుంటే సరిపోతుంది. కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా పెరుగుతాయి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలకు మస్కారా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు.