Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాజా పుదీనా ఆకులతో తయారు చేసిన చారును తాగితే మంచి బావనతో పాటు ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతారు. పుదీనా చారు తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. పుదీనా చారును ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత ఒక కప్పు తాగితే మానసికంగా, శారీరకంగా కూడా ఆనందంగా ఉంటారు. పుదీనా చారును చాలా సులభంగా, త్వరగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం ఒక గ్లాసు నీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించిన నీటిలో సగం చెంచా నిమ్మరసం, రెండు చెంచాల తేనె, ఐదు లేదా ఆరు తాజా పుదీనా ఆకులను వేసుకుంటే సరిపోతుంది.