Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలామంది వారానికొకసారి ఇల్లు దులుపుదామని అనుకుంటారు. కాని దుమ్ము పట్టుకున్న సోఫాలు, టీపారు, కంప్యూటర్లు, డైనింగ్ టేబుల్, కిచెన్ సింక్ వంటివి రోజు ఉపయోగిస్తూనే ఉంటాం. అలా శుభ్రపరకుండా వాటిని ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు అసహ్యం కూడా వేస్తుంది. ప్రతిరోజూ ఇంట్లో ఉపయోగించే వస్తువులకు దుమ్ము పట్టడమనేది సహజం. వాటిని శుభ్రం చేయడం దినచర్యలో భాగంగా పెట్టుకుంటే సరిపోతుంది.రోజూ తప్పని సరిగా శుభ్రం చేయాల్సిన కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం...!
ఖరీదైన వస్తువులు: అతి ఖరీదైన డివిడి ప్లేయర్లు, టీ.వీలు, కంప్యూటర్లు మొదలైనవి ఫెదర్ డస్టర్ తో ప్రతిరోజూ శుభ్రపరిస్తే చూడటానికి బాగుంటాయి. లేదంటే దుమ్ముపట్టి ఇబ్బంది కలిగిస్తాయి.
డైనింగ్ టేబుల్: ప్రతిరోజు భోజనం చేస్తారు కనుక డైనింగ్ టేబుల్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కీలకం. డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసే సమయంలో పడ్డ ఆహార పదార్ధాలు, మరకలు, ఎన్నో వుంటాయి. వీకెండ్లో శుభ్రం చేద్దామనుకుంటే చాలా అసహ్యంగా తయారవుతుంది. కాబట్టి ఒక తడి గుడ్డను తీసుకొని వీలైనంత త్వరగా తుడిచేస్తే మరకలు మాయమై డైనింగ్ టేబుల్ అందంగా, శుభ్రంగా కనిపిస్తుంది.
కిచెన్ సింక్: ప్రతిరోజూ పాత్రలను శుభ్రం చేయడానికి సింక్‌ను ఉపయోగిస్తారు. కాబట్టి సింక్ కూడా శుభ్రంగా వుంటే పాత్రల శుభ్రత మరింత బాగుంటుంది. శుభ్రం చేయవలసిన వాటిలో ఇది ప్రధానమైన పని.
స్టవ్: వంట పూర్తయిన తర్వాత, గ్యాస్ స్టవ్, కిచెన్ స్లాబ్ తప్పక శుభ్రం చేసుకోవాలి. అక్కడ ఏ మాత్రం మురికి లేదా పదార్ధాలు పడి వున్నా తినే ఆహారం కూడా పాడవుతుంది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బొద్దింకలు, ఈగలు ఆహరపదార్థాల మీద వాలి అనారోగ్యం పాలు చేస్తాయి.
చాపింగ్ బోర్డ్ అండ్ నైఫ్స్ : కూరగాయలు కట్ చేసే కత్తులు, చాపింగ్ బోర్డ్ వంటివాటిని రెగ్యులర్ గా క్లీన్ చేయడం చాలా అవసరం.
చికెన్ టవల్స్ అండ్ స్పాంజ్ : వంటగదిలోని టవల్స్, స్పాంజ్ లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. వీటిని గాలి తగిలే ప్రదేశంలో ఉంచితే మరి మంచిది.
బెడ్ రూమ్ : బెడ్ రూమ్‌లోని బెడ్స్‌ను ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. బెడ్ షీట్ దులపటం, ముడుతలు లేకుండా చేయటం, మెత్తలు సరి చేయటం, రాత్రి వేళ కప్పుకున్న దుప్పటి మడత పెట్టటం వంటివి తప్పక చేయాలి.
ఫ్లోర్: ప్రతిరోజు పనుల్లో తప్పని సరిగా ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకోవడం వల్ల పండుగల సమయంలో, ఇంట్లో ఏదైనా శుభాకార్యలు జరిగినప్పుడు పని చాలా తక్కువగా వుంటుంది.